హాస్పిటల్‌లో ప్రీతి పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడానికి గవర్నర్ తమిళిసై వెళ్లారు. అయితే, ఆమె ఓ పూలదండను కూడా వెంట తెచ్చారని, తన అక్క ఏమైనా మరణించిందా? పూల దండ ఎందుకు తెచ్చారని ప్రీతి సోదరి ఆగ్రహించారు. 

హైదరాబాద్: పీజీ మెడికో ప్రీతి ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఆమె గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె పరిస్థితి తెలుసుకోవడానికి స్వయంగా హాస్పిటల్ వెళ్లారు. అయితే, ఆమె వెంట పూల దండ కూడా తీసుకెళ్లారని దీప్తి సోదరి ఆరోపించారు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు.

‘మా అక్కడ మరణించిందా? ఆమె చనిపోయిందని పూల దండ తెచ్చారా? గవర్నర్ తమిళిసై పూల దండ ఎందుకు తెచ్చారు?’ అని దీప్తి సోదరి ఆగ్రహంతో ప్రశ్నలు వేశారు. గవర్నర్‌గా ఆమె ఈ ఘటనపై ఓ కమిటీ వేయాల్సిందని, కానీ, అలా చేయకుండా ఆమె ఓ పూల దండ వెంట తీసుకురావడం ఏమిటని అన్నారు. హెచ్‌వోడీ నుంచి ప్రిన్సిపల్ వరకు అందరికీ ఫిర్యాదు చేశామని, కానీ, ఎవరూ సరైన రీతిలో విచారణ చేయట్లేదని అన్నారు. ఎస్టీ అమ్మాయి కాబట్టే ఈ వివక్ష అంటూ ఆక్షేపించారు. 

Also Read: మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం: సైఫ్ నకు 14 రోజుల రిమాండ్, ఖమ్మంకు తరలింపు

ప్రీతికి అందిస్తున్న చికిత్సపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన అమ్మాయి కాబట్టే చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికే ప్రీతిని వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారని అన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటన పై రాజకీయాలు కూడా మొదలవుతున్నాయి. ఇది ముమ్మాటికీ లవ్ జిహాదే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తుండగా.. ఈ ఘటనలో రాజకీయాల్లేవని మంత్రి హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.