మిర్యాలగుడా: ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన మారుతీ రావు ఆత్మహత్య నేపథ్యంలో అమృత వర్షిణి ఇంటి వద్ద బందోబస్తును పెంచారు. మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రేమ వివాహం చేసుకున్న కూతురు అమృత వర్షిణి భర్త ప్రణయ్ ను హత్య చేయించిన తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రణయ్ హత్య కేసులో శిక్ష తప్పదని మారుతీ రావు అభిప్రాయానికి వచ్చి తన ఆస్తులను భార్య పేర రాసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ వీలునామా రాసినట్లు చెబుతున్నారు. తమ్ముడు శ్రవణ్ కుమార్ అతనితో ఆస్తి పంపకాలు పూర్తి చేసుకున్నాడు. 

Also Read: అమ్మ దగ్గరకు వెళ్లు: అమృతకు మారుతీరావు చివరి మాటలు

ప్రణయ్ హత్య కేసులో నిందితులైన అబ్దుల్ బారీ, సుభాష్ శర్మలు శిక్ష తప్పదనే అభిప్రాయానికి వచ్చి మారుతీ రావును వేధించినట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్లు భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. అన్ని ఒత్తిళ్లకు తోడు ఈ ఒత్తిడి కూడా తోడు కావడంతో మారుతీ రావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. 

ప్రణయ్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. ఇందులో మారుతీ రావు ప్రధాన నిందితుడు కాగా సుభాష్ శర్మ, హజ్గర్ అలీ, మహ్మద్ బారీ, కరీం (కాంగ్రెసు నేత), శ్రవణ్ (మారుతీరావు తమ్ముడు), శివ (మారుతీ రావు డ్రైవర్), ఎం. ఎ నిజాం నిందితులుగా ఉన్నారు. 

Also Read: నాన్న టచ్ లో లేరు, పశ్చాత్తాపంతోనే కావచ్చు: మారుతీరావు కూతురు అమృత

ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. దీంతో తమకు శిక్ష తప్పదనే అభిప్రాయానికి నిందితులంతా వచ్చినట్లు చెబుతున్నారు.