ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది. కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. రీసెంట్ గా ఇద్దరికీ బ్రేకప్ అవ్వడంతో మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టింది.

చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఆమె నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో 'పాగల్ పంటీ', 'ది బిగ్ బుల్' 
అనే చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ 'ది లవ్, లాఫ్, లైవ్ షో'లో పాల్గొంది. ఆ షోలో సింగర్ శిబాని దండేకర్ తో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమె సెక్స్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హాట్ ఫోటోలతో షేక్ చేస్తున్న ఇలియానా.. ఫ్యాన్స్ ఫిదా!

గతంలో ఇలియానా 'శృంగారానికి ప్రేమతో సంబంధం లేదు' అని ఓ కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై శిబాని ప్రశ్నించగా.. తాను ఆ విధంగా చెప్పలేదని.. తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పింది. తను సెక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తానని, వర్కవుట్ లా చేస్తున్నానని తనే స్వయంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయని.. కానీ వాటిల్లో నిజం లేదని చెప్పింది.

 

ఎమోషన్స్ ఉంటేనే సెక్స్ ని ఎంజాయ్ చేయగలమని చెప్పింది. శృంగారం అనేది అద్భుతమైన అనుభవమని.. అది కేవలం ఆడ, మగ కలయిక మాత్రమే కాదు. శృంగారం అనేది పూర్తిగా మానసికమని చెప్పింది. ఇద్దరి మధ్య ప్రేమ లేకపోతే శృంగారం అనేది యాంత్రికంగా మారుతుందని.. అలాంటి  శృంగారానికి అర్ధమే లేదని చెప్పింది. రెండు శరీరాలు కాదు.. రెండు ఆత్మల కలయికే శృంగారమని చెప్పుకొచ్చింది.