తెలంగాణలో మావోయిస్టు దంపతుల లొంగుబాటు

First Published 25, Dec 2017, 2:35 PM IST
Maoist top gun jampanna surrenders before telangana dgp mahendarreddy
Highlights
  • లొంగుబాటు వెనుక ఎవరి ఒత్తిళ్లు లేవు
  • సైద్ధాంతిక విబేధాలే కారణం
  • గతంలో పరిస్థితులు ఇప్పుడు లేవు

33 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ లో సుదీర్ఘంగా పనిచేసిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయనతోపాటు 13 ఏళ్లు గా మావోయిస్టు పార్టీ లో వివిధ హోదాలో పని చేసిన అతని భార్య అనిత అలియాస్ రజిత కూడా పోలీసుల ఎదుట లొంగిపోయింది. వారు లొంగిపోయినట్లు జన జీవన స్రవంతిలో కలిసినట్లు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ప్రకటించారు. మహేందర్ రెడ్డి వీరిద్దరినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా డిజిపి మాట్లాడారు.. చదవండి.

జంపన్న 1984 సంవత్సరంలో పీపుల్స్ వార్ గ్రూప్ లో దళ సభ్యుడుగా చేరాడు. అనేక హోదాలో పనిచేసిన జంపన్న డివిజన్ కమిటీ దగ్గర నుండి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీ సభ్యుడి హోదాలో పనిచేశాడు. జంపన్న పై  మొత్తం 100 కేసులు  ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం లో 51 కేసులు నమోదై ఉన్నాయి. జంపన్న పై 25 లక్షల రివార్డు కూడా ఉంది.

జంపన్న భార్య అనిత అలియాస్ రజిత వరంగల్ జిల్లా దామర గ్రామానికి చెందిన మహిళ. ఇంటర్, డిగ్రీ వరంగల్ లో చేసి  MSC ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకుంటున్న నేపథ్యంలో అక్టోబర్ 2004 లో పీపుల్స్ వార్ లో  ప్రెస్ టీం సభ్యురాలు గా చేరింది. అనేక కమిటీల్లో పని చేసిన రజిత 2009 సంవత్సరం లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గా ఉన్న  జంపన్నతో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. పార్టీ  సైద్ధాంతిక మార్పుల వలన వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. రజిత పై ఉన్న 5 లక్షల రివార్డు ఉంది. వీరిద్దరి పై ఉన్న రివార్డులను వారికే  అందజేస్తాం.

ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 135 మంది మావోయిస్టులు ఇంకా అనేక రాష్ట్రాలలో పని చేస్తున్నారు. వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి జన జీవన స్రవంతిలో కలవాలి.

సైద్ధాంతిక సమస్యే కారణం : జంపన్న

ఈ సందరర్భంగా జంపన్న అలియాస్ నర్సింహ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను తన సహచరి అనిత..సుదీర్ఘకాలం పనిచేసిన విప్లవ జీవితాన్ని ఒదులుకొని... సాధారణ జీవితం గడిపేందుకు సరెండర్ అవుతన్నామని చెప్పారు. తమ లొంగుబాటులో ఎలాంటి బలవంతపు ఒత్తిళ్లు లేవన్నారు. మేము బయటకి  రావడానికి కారణం సైద్దాంతిక సమస్యనే అన్నారు. -పీపుల్స్ వార్ తో కొనసాగిన చరిత్ర లో పార్టి లైన్ ప్రకారం ప్రజల కోసం నిజాయితీగా నిబద్ధతతో పనిచేశామన్నారు. నాటి పీపుల్స్ వార్, ఆతర్వాత సిపిఐఎంల్ లో పనిచేయడం సైరైనదనే భావిస్తున్నట్లు చెప్పారు. గత 10,15 సంవత్సరాల్లో దేశంలో అనేక మార్పులు వచ్చాయని, భూ స్వామ్య వ్వవస్థ 1980 ,1990 ఉన్నట్ల ఇప్పుడు లేదన్నారు. అప్పట్లో పీపుల్స్ వార్ లో చేరడం సైరైనదే అనుకున్నామన్నారు. వ్యక్తి గత కారణాల రీత్య బయటకి వచ్చానని, నాయకత్వం తనను ఉండమని కోరిందని చెప్పారు. తాను, తన కుటుంబం ఈ పరిస్థితిల్లో విప్లవ కార్యక్రమాలు దూరంగా ఉండాలని నిర్లయించుకున్నట్లు వెల్లడించారు. సొంతూరులోనే బతకాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

loader