ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భకేలి - భాన్సీ మధ్యలో రైలు పట్టాలను మావోయిస్టులు తొలగించారు. దీంతో ఆ రూట్ లో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలులోని 6 గూడ్స్ బోగీలు పట్టాలు తప్పాయి. కిరండోల్‌లో సాగునీటి ప్రాజెక్టుల కోసం పనులు చేస్తున్న ఓ ప్రొక్లెయిన్‌తో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు నక్సలైట్లు. సోమవారం నాటి బంద్‌ను విజయవంతం చేయాలని పోస్టర్లు అంటించారు. జయశంకర్ భూపాలపల్లిలోని వెంకటాపురం మండలం ఎదిర వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు రైల్వే అధికారులు. మావోయిస్టులు పేల్చిన రైల్వే ట్రాక్ వీడియో కింద చూడొచ్చు.