Asianet News TeluguAsianet News Telugu

అంత అహంకారం పనికిరాదు కేసిఆర్..

  • కిరణ్, వైఎస్ లకంటే మించిపోయావు
  • హైకోర్టు కోసం నిలదీసిన ఎంపిలు వర్గీకరణపై ఎందుకు సైలెంట్
  • దళితుల పట్ల నీకు చిన్నచూపు
manda krishna madiaga fire on kcr

ముఖ్యమంత్రి గా ఉన్న కేసిఆర్ కు అంత అహంకారం పనికిరాదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. గతంలో అహంకారం నెత్తికెక్కిన వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మంద మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో చదవండి.

 హై కోర్ట్ విభజన కోసం పార్లమెంట్ ను స్తంభింపజేసిన తెలంగాణ  ఎం.పిలు వర్గీకరణ విషయం పై ఎందుకు నిలదీయడం లేదు. 23 ఏళ్ళు గా పోరాటం చేస్తున్నా మా దళితులపై ఇంత చిన్న చూపు ఎందుకు. ముఖ్యమంత్రి కి సూటి ప్రశ్న అడుగున్నాను.. అసలు వర్గీకరణ విషయం లో మీ స్పష్టత ఏంటి ? ఈ సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటి...? 

కేంద్రంలో పెండింగ్ లో ఉన్న అంశంపై ఢిల్లీలోనే పరిష్కారం చేయాలి అన్న టిఆర్ఎస్ నేతలు నేను ఢిల్లీలో నెలరోజులు ధర్నా చేసిన టి.ఆర్.ఎస్ ఎం.పి లు మద్దతు తెలుపలేదు. నిజంగా మీకు  శిత్తశుద్ది ఉంటే  జనవరి 1 నుండి 5 వరకు పార్లమెంట్ ఎదుట గాంధేయ మార్గం లో నిరసన తెలుపుతం అప్పుడు మీ వైఖరి చెప్పాలి. షెడ్యూలు కూలల వర్గీకరణ అంశంపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పలేదు.

గాంధేయ మార్గం లో నిరసన కు ఇందిరా పార్కు లేదా....బాపు ఘాట్ లో అనుమతి ఇవ్వండి. లేదా మీకు  గ్రేటర్ హైదరాబాద్  మీకు నచ్చిన చోటు లో అనుమతి ఇవ్వండి. ఉద్యమ సమయంలో మీకు మేము సహకరించాము. కాబట్టి మీ మద్దతు అడుగుతున్నాము.  ప్రజాస్వామ్య దేశంలో  నిరసన తెలిపే హక్కు అందరికి ఉంటుంది. ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వం కాపాడాలి.

ఆదివాసీల డిమాండ్ న్యాయమైన డిమాండ్. కానీ పాలకుల వైఫల్యం వల్ల రెండు వర్గాల మధ్య దాడులకు దారి తీసింది. 23 ఏళ్ళ లో మాదిగ వర్గీకరణ విషయం లో ఎక్కడ చిన్న గొడవలకు తావు లేకుండా చేసాం. కేసీఆర్ దళితులను చాలా చిన్న చూపు చూస్తున్నారు. మాదిగ, మాలలకు కూడా మీ మీద  అసంతృప్తి ఉంది.

కెసిఆర్ కి 11 ప్రశ్నలు

1. ఎస్సి వర్గీకరణకు నవంబర్ 6 న రెండు రోజుల్లో అఖిలపక్షం ఏర్పాటు అన్నారు ఏమైంది. 50  రోజులు అయింది. మీ మాట ఎక్కడ నిలబెట్టుకున్నారు. మా భారతి మృతికి కేసీఆర్ కారణం. భారతి సంస్మరణ సభకి శాసనసభ లో ముఖ్యమంత్రి ప్రకటించిన దానికి 40 రోజుల తేడా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ లో  విగ్రహాలు విధ్వంసం చేయలేదా. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు పోలీసులను బండ బూతులు తిట్టారు...మేము అలా చేసామా. శాంతి యుతంగా ఆందోళన చేసిన మమ్ములను 10 రోజులు జైల్ లో పెడతారా. దీనికి అంతటికీ కారణమయిన కేసీఆర్ మీద ఎన్ని కేసులు పెట్టాలి...ఎన్ని రోజులు జైల్ లో పెట్టాలి.

2. నిన్న పార్లమెంట్ లో గొడవ చేసిన ఎం.పి లను ఎస్సి వర్గీకరణ పై నిలదీయమని చెప్పాలి.

3. తెలంగాణలో 15 మంది ఎస్సి ఎమ్మెల్యే లు ఉంటే ఒక్కడు మంత్రి కాడా... అదే అగ్రకులాల కు మాత్రం ఎక్కువ ఉండచ్చా..మీ సామాజిక వర్గానికి చెందిన వారు 4 ఉండొచ్చా.

4.మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ ప్రాజెక్టు లలో  అవినీతిజరిగుతుంది. దళితులకు మూడెకరాల భూమి అంశాన్ని నిర్విర్యం చేశారు.

5. టి.ఆర్.ఎస్  మని ఫెస్టో లో 50 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతాంఅన్నారు. ఇప్పటివరకు చేసిన ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

6.దళితుల పై దాడులు జరుగుతున్నాయని డి.జి.పి నివేదిక చెప్తున్నా చర్యలు ఏవీ. దీనిపై ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి....లేదా హోంమంత్రి చేయాలి...అసలు దీనిపై ఎస్సి కమిషన్ ఏర్పాటు చేయాలి. ఏ.పి లో ఉంది ఇక్కడ ఎందుకు లేదు.

7. మాదిగలకు దండోరా భవన్ లు అన్నారు కేసీఆర్. మొదట డిక్లేర్ చేసింది దండోరా భవనం మరి అందరి కంటే ముందు ప్రకటించిన దండోరా భవనం ఎక్కడ.

8.షెడ్యూలు కులాల పేరిట  డప్పుకు, చెప్పుకు రెండు వేలు అని తిరిగారు.కవిత,హరీష్ రావు, కేటీఆర్, కడియం, ఈటెల,జగదీష్ రెడ్డి లు ప్రచారం చేశారు. అది ఏమైంది...?

9. మాదిగ అధికారుల మీద వివక్ష, మొదటి చీఫ్ సెక్రెటరీ రాజీవ్ శర్మ, రెండవ వ్యక్తి ప్రదీప్ చంద్ర, ఇద్దరి విషయం లో  ప్రదీప్ కి అన్యాయం జరుగలేదా..మిగులు బడ్జెట్, పరిశ్రమల రూపకల్పన చేసింది ప్రదీప్ అన్నది మిరే కాదా...

10..గిరిజన శాఖ, బిసి శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఎవరు. 15 మంది ఎస్సి ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్లు ఇచ్చావ్...ఎందుకు  అవమానిస్తున్నావ్? నీ దగ్గర పనిచేసే ఆఫీషియల్స్ లో ఒక్కడు దళితుడు ఉన్నాడా.నీ సలహా మండలిలో ఒక్క దళిత లీడర్ ఉన్నాడా....?

11. మా కాక వెంకట స్వామి ఉద్యమ సమయంలో  ఎన్నో సార్లు తెలంగాణ రాష్ట్రం అవసరమని అన్నాడు. అలాంటి కాకా కు ట్యాంక్ బండ్ పైన విగ్రహం కట్టావు కదా కేసీఆర్... మరి తన ప్రాణాన్ని తెలంగాణ కోసం అర్పించిన సదా లక్మికి నీవు ఇచ్చిన గౌరవం ఏంటి.

నేను అడిగిన ప్రశ్నలకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం లేదా కేసీఆర్ లేదా వారి తొత్తులు ఎవరు సమాధానం చెప్పినా నేను కేసీఆర్ జోలికి రాను. అంత అహంకారం పనికి రాదు. కిరణ్ కుమార్ రెడ్డి గతి ఏమైంది. రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి నిర్బంధం చేసిండు.... ఈ రెండు కలిపి ఇప్పుడు కేసీఆర్ చేస్తుండు.

Follow Us:
Download App:
  • android
  • ios