Asianet News TeluguAsianet News Telugu

చకినాల ముక్క గొంతులో ఇరుక్కుని మంచిర్యాల వాసి మృతి

మంచిర్యాల జిల్లాలో 65 ఏళ్ల ఎన్ రంగారావు డిన్నర్ చేస్తుండగా చకినాలు తిన్నాడు. అవి తింటూ ఉండగా ఓ ముక్క ఆయన గొంతులో ఇరికింది. దీంతో ఊపిరాడక ఆయన మరణించాడు.
 

mancherial man dies after piece of chakina stuck in throat kms
Author
First Published Jan 31, 2024, 4:24 PM IST

Mancherial: తెలంగాణలో ప్రధాన పండుగలకు ప్రజలు ఇంట్లో తినుబండారాలు చేసుకుంటారు. ముఖ్యంగా గారెలు, చకినాలు, మడుగులు చాలా ఫేమస్. పండుగల తర్వాత కూడా చాలా రోజులు వాటిని స్నాక్స్ తరహా తీసుకుంటూ ఉంటారు. కానీ, సంతోష సమయాల కోసం చేసుకునే ఈ చకినాలు మంచిర్యాలలోని ఓ కుటంబంలో విషాదం నింపింది. 65 ఏళ్ల వృద్ధుడు చకిన ముక్కను నోట్లో వేసుకుని తినబోతుండగా.. ఓ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరి తీసుకోవడానికి గింజుకున్నాడు. హాస్పిటల్ తీసుకెళ్లే లోపే మరణించాడు.

మంచిర్యాలలోని హమాలివాడలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై మంచిర్యాల సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. ఎన్ రంగా రావు చకినాల ముక్కను నోట్లో వేసుకున్నాడు. అయితే, ఓ ముక్క ఆయన గొంతులో ఇరుక్కుంది. ఆయనను వెంటనే హాస్పిటల్ తరలించారు. కానీ, ఎన్ రంగారావు అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. 

Also Read : Bihar: నితీశ్ యూటర్న్‌ బీజేపీకి కలిసొస్తుందా? బిహార్ సర్వేలో సంచలన విషయాలు

ఎన్ రంగారావు డిన్నర్ చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఎన్ రంగారావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. కొడుకు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios