హైదరాబాద్ లో రూ.3 కోట్ల విలువచేసే పుస్తకాల చోరీ

Man, son steal books worth Rs 3 crore, arrested
Highlights

తాను అద్దెకిచ్చిన ఇంట్లోని ఓ గోడౌన్ లోనే స్వయంగా యజమాని తన కొడుకుతొో కలిసి దొంగతనానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అందులోని దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే
పుస్తకాలను అపహరించిన ఓనర్ చివరకు దొంగతనం బైటపడి కటకటాలపాలయ్యాడు. 

తాను అద్దెకిచ్చిన ఇంట్లోని ఓ గోడౌన్ లోనే స్వయంగా యజమాని తన కొడుకుతొో కలిసి దొంగతనానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అందులోని దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే
పుస్తకాలను అపహరించిన ఓనర్ చివరకు దొంగతనం బైటపడి కటకటాలపాలయ్యాడు. 

ఈ దొంగతనానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాచీగూడలో నివాసముండే పి.నర్సింహా రెడ్డి(73) కి మేడ్చల్ జిల్లా కాప్రాలో ఓ గోడౌన్ ఉంది. దీన్ని అతడు ఓ బుక్ స్టోర్ యజమాని నికేతన్ దేవడిగ కు లీజుకిచ్చాడు. ఈ గోడౌన్ అద్దెను నెలకు రూ.50,000 లుగా నిర్ణయించాడు. అయితే ఆర్థిక కారణాలతో నికేతన్ గత 14 నెలలుగా గోడౌన్ అద్దె చెల్లించడం లేదు. నర్సింహ రెడ్డి ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుని తిరుగుతున్నాడు. నికేతన్ రూ.7 లక్షల రూపాయల అద్దె బకాయి పడ్డాడు. 

దీంతో నర్సింహ రెడ్డి తన కొడుకు శ్రీనివాస రెడ్డి సాయంతో గోడౌన్ షెటర్ తాళం పగలగొట్టి అందులో వున్న దాదాపు రూ. 3.24 కోట్ల విలువైన లక్షా తొమ్మిదివేల పుస్తకాలను అపహరించాడు. వాటిని 10 ట్రక్కుల్లో నింపి బేగం బజార్ లోని ఎమ్ఆర్ బుక్ సెంటర్ కు తరలించాడు. దాని యజమాని సాయంతో పుస్తకాలను రజీయుద్దిన్ సాయంతో మరో వ్యక్తి  అమ్ముకున్నాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న నికేతన్ గోడౌన్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నర్సింహ రెడ్డి, అతడి కొడుకు శ్రీనివాస్ రెడ్డి తో పాటు రజియుద్దిన్ ల ను అరెప్ట్ చేశారు. సెక్షన్ 457, 380 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద పుస్తకాలను కొనుగోలు చేసిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

loader