Asianet News TeluguAsianet News Telugu

‘నేను సీఐడీలో ఉన్నతాధికారిని. నీతో గడపాలని ఉంది. ఎక్కడికి రావాలో చెప్పు’.. మహిళకు వేధింపులు..

ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన బాధితురాలికి గత నెల 29న ఓ కొత్త నంబర్ నుంచి ముందుగా వాట్సాప్ లో సందేశం వచ్చింది. ఆ తరువాత కొద్ది సేపటికి వీడియో కాల్స్ రావడం మొదలయ్యింది. ‘నిన్ను ఓ వేడుకలో చూశా.. అప్పుడే బాగా నచ్చేశావు.. నీతో గడపాలని ఉంది. ఎక్కడికి రావాలో చెప్పు’ అంటూ అటువైపు నుంచి ఓ వ్యక్తి వేధించడం మొదలుపెట్టాడు. 

man sexually harassed a woman in the name of cid officer in hyderabad
Author
Hyderabad, First Published Nov 12, 2021, 8:17 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ : ‘నేను సీఐడీలో ఉన్నతాధికారిని. నువ్విష్టమని చెబితే నన్నే కాదంటావా?.. నువ్వు నాకు కావాలంతే..’ అంటూ ఓ మహిళను sexual harassment చేస్తున్న ఘటన రాచకొండ పరిధిలో తాజాగా వెలుగు చూసింది. బాధితురాలి (30) ఫిర్యాదు మేరకు రాచకొండ cyber crime police కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వివరాల్లోకి వెడితే.. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన బాధితురాలికి గత నెల 29న ఓ కొత్త నంబర్ నుంచి ముందుగా వాట్సాప్ లో సందేశం వచ్చింది. ఆ తరువాత కొద్ది సేపటికి వీడియో కాల్స్ రావడం మొదలయ్యింది. ‘నిన్ను ఓ వేడుకలో చూశా.. అప్పుడే బాగా నచ్చేశావు.. నీతో గడపాలని ఉంది. ఎక్కడికి రావాలో చెప్పు’ అంటూ అటువైపు నుంచి ఓ వ్యక్తి వేధించడం మొదలుపెట్టాడు. 

అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించాడు. బాధితురాలు చూసినట్లు double ticks రాగానే వాటిని డిటిల్ చేసేవాడు. సహనం కోల్పోయిన victim ‘అసలు నువ్వెవరు? ఎందుకిలా చేస్తున్నావు’ అంటూ నిలదీసింది. తాను సీఐడీ విభాగంలో ఉన్నతాధికారిని అని చెప్పాడు. 

వీడు మామూలోడు కాదు.. చదివింది ఇంటర్.. ఏకంగా 20 ఫేక్ కంపెనీలు, రూ. 265 కోట్ల నకిలీ ఇన్ వాయిస్ లు...!!

కొంత సేపటికి Police uniformలో వీడియో కాల్ చేయడంతో ఆమె భయపడింది. వెంటనే ఆ నెంబర్ ను బ్లాక్ చేసింది. అయితే అతను అక్కడితో ఆగలేదు. ఆ తరువాత మరో నంబర్ నుంచి మెసేజ్ లు, వీడియో కాల్స్ రావడం మొదలయ్యింది. నా నెంబర్ నే బ్లాక్ చేస్తావా? అంటూ బెదిరింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

విగ్గు’తో ముగ్గులోకి...
తనకు తాను ఎన్నారైగా చెప్పుకొని ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన మహిళలతో సహజీవనం చేసి నగదు, నగలు దోచుకుపోతున్న ప్రబుద్ధుడు గురువారం పోలీసులకు చిక్కాడు.  ఇటీవల కేపీహెచ్ బీకాలనీకి చెందిన మహిళ (33)కు ఇంస్టాగ్రామ్ లో కార్తీక్ వర్మ పేరుతో పరిచయమైన షేక్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమె దగ్గర నుంచి 18.5 తులాల బంగారు ఆభరణాలు,  రూ.70 వేల నగదు స్వాహా చేసి ఉడాయించిన విషయం తెలిసిందే.

victim పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు  రఫీని పట్టుకున్నారు. అతని వేషం, అవతారం చూసి ముందుగా పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఆ తరువాత Interrogationలో వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

రఫీ ది తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామం.  కేపీహెచ్ బీ కాలనీకి చెందిన బాధితురాలితో పాటు మరో నలుగురు womenను ఇలాగే 
Cheating చేసినట్లు పోలీసులు గుర్తించారు.  పదవ తరగతి వరకు చదువుకున్న రఫీ పాలిటెక్నిక్ మధ్యలో వదిలేశాడు. 2010లో నగరానికి చేరుకుని పలుచోట్ల కార్మికుడిగా పని చేశాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  జల్సాలకు అలవాటుపడి భార్యను Harassement చేస్తుండటంతో ఆమె ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా గూడూరులో కేసు నమోదైంది. అప్పటినుంచి రఫీ  మధురానగర్ లో ఒంటరిగా ఉంటున్నాడు.

భార్య నుంచి దూరమైన  నిందితుడు  జల్సాల కోసం మహిళలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. Instagramలో తన పేరు  కార్తీక్ వర్మగా పెట్టుకుని మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని మెల్లిగా ప్రేమ,Live-in Relationshipలోకి మార్చేవాడు. వారితో కొంతకాలం సహజీవనం చేసి తరువాత అసలు స్వరూపం బయట పెట్టేవాడు. తన అవసరాలకు డబ్బు అవసరమని మహిళల నుంచి  అందినంత డబ్బు, నగలు తీసుకుని  ఉడాయించేవాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios