Asianet News TeluguAsianet News Telugu

వీడు మామూలోడు కాదు.. చదివింది ఇంటర్.. ఏకంగా 20 ఫేక్ కంపెనీలు, రూ. 265 కోట్ల నకిలీ ఇన్ వాయిస్ లు...!!

హైదరాబాద్ కు చెందిన 34 ఏళ్ల యువకుడు తెలుగు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో 20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి బిల్లులు సృష్టించాడు. ఈ సంస్థల  నుంచి దేశంలోని వివిధ నగరాల్లో సరకు లావాదేవీలు జరిపినట్టు రూ. 265 కోట్ల మేర ఫేక్ ఇన్ వాయిస్ లు రూపొందించాడు.

man created 20 fake compaines with inter qualification in hyderabad
Author
Hyderabad, First Published Nov 12, 2021, 7:53 AM IST

విశాఖపట్నం : కేవలం ఇంటర్ వరకే చదివిన ఆ యువకుడు చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ జిఎస్టి లొసుగుల్ని పసిపెట్టాడు. ఇంకేముంది ఈజీగా మోసం చేయడం ఎలాగో అవగతం అయ్యింది. అంతే.. గుంటూరు, హైదరాబాద్ నగరాల్లో.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 ఫేక్ కంపెనీలను సృష్టించాడు.  

పన్ను మోసాలకు పాల్పడేందుకు ఎత్తుగడ వేశాడు. దీనికోసం తన తెలివినంతా ఉపయోగించాడు. అయితే చివర్లో తన ప్లాన్ పూర్తిగా ఫలించకముందే దెబ్బతిన్నాడు.  నిరంతర తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్ టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు ఆ యువకుడి మోసాన్ని బట్టబయలు చేశారు.

hyderabad కు చెందిన 34 ఏళ్ల యువకుడు తెలుగు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో 20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి బిల్లులు సృష్టించాడు. ఈ సంస్థల  నుంచి దేశంలోని వివిధ నగరాల్లో సరకు లావాదేవీలు జరిపినట్టు రూ. 265 కోట్ల మేర Fake invoiceలు రూపొందించాడు. వీటిని ఉపయోగించుకొని రూ. 31కోట్ల ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.. పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాన్ని అమలు పరిచాడు.

ఈ భారీ నకిలీ ఇన్వాయిస్ లను పరిశీలించి DGGI, Central GST వర్గాలు... తీగ లాగితే డొంకంతా కదిలినట్లు 20 నకిలీ సంస్థల రాకెట్ల గుట్టు రట్టయ్యింది. వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటిలిజెన్స్ విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ భాస్కరరావు తెలిపారు.

సర్దుబాటు తర్వాత ఉద్యోగ భర్తీ , డీఏ విడుదలకు గ్రీన్‌సిగ్నల్: టీజీవోలకు కేసీఆర్ హామీ

గత ఏడాది నవంబర్ నుంచి ఈ తరహా మోసాలపై దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 180 నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ. 60 కోట్లు రికవరీ చేయడంతోపాటు ఐదుగురిని అరెస్టు చేసినట్లు భాస్కరరావు తెలిపారు.

ప్రేమోన్మాది దాడి..
హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో (LB nagar) పెళ్లికి నికారకరించిందనే కోపంతో యువతిపై కక్షగట్టి విచక్షణ రహితంగా కత్తితో దాడి (woman stabbed) చేసిన నిందితుడు బస్వరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని వైద్య పరీక్షల అనంతరం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను కోర్టుకు వివరించారు. 

దీంతో న్యాయస్థానం నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంత‌రం బ‌స్వ‌రాజును పోలీసులు చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు. మరోపై బస్వరాజు దాడిలో గాయపడిన యువతి ఆస్పప్రతిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని.. 48 గంటలు గడిస్తేనే గానీ ఏం చెప్పలేమని అన్నారు.

వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మం డలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన బస్వరాజ్‌(23) హైదరాబాద్‌లో రాందేవ్‌గూడలో ఉన్న సన్‌సిటీలో ఉంటూ సెంట్రింగ్‌ పని చేస్తున్నాడు.  అదే మండలానికి చెందిన యువతి (20) గతేడాది హస్తినాపురం సెంట్రల్‌లోని తన పిన్ని వద్ద ఉంటోంది. ఈమె ఇంటర్‌ పూర్తి చేసింది. దూరపు బంధువైన ఆ యువతితో బస్వరాజ్‌కు పరిచయం ఉంది. ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమె మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. 

అయితే కుటుంబ సభ్యులను ఎదురించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి ఏం చేయలేకపోయింది. మరోవైపు బస్వరాజు తరచూ యువతికి ఫోన్‌లు చేసి తనను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం యువతి ఉంటున్న ఇంటికి చేరుకున్న బస్వరాజు ఆమె మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. యువతి చేతులు, వీపు, ఛాతీ, తొడ, కడుపు భాగాల్లో మొత్తం 18 కత్తిపోట్లు గాయాలయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios