హైదరాబాద్‌‌‌ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. బాచుపల్లి‌లో (Bachupally) ఓ ఇంజనీరింగ్ విద్యార్థి (Engineering student) హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతడు సూసైడ్ నోట్ రాశాడు. 

హైదరాబాద్‌‌‌ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. బాచుపల్లి‌లో (Bachupally) ఓ ఇంజనీరింగ్ విద్యార్థి (Engineering student) హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతడు సూసైడ్ నోట్ రాశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. శివనాగులు ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు. అతడు బాచుపల్లిలోని కాలేజ్ హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే ఏమైందో తెలియదు గానీ.. సూసైడ్ నోట్ రాసి హాస్టల్ భవనం 13వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య (suicide) చేసుకన్నాడు. 

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరించారు. శివనాగులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శివనాగులు రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీవితంపై విరక్తితోనే చనిపోతున్నట్లు శివనాగులు అందులో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. 

హాస్టల్ ‌గదిలో ఉరేసుకున్న విద్యార్థి.. 
ఇక, గత నెలలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని జేబీఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి కాలేజ్ హాస్టల్‌ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌ జిల్లాకు చెందిన గజ్జెల కృష్ణ విజయ భాస్కర్‌రాజు(20) బీటెక్‌ రెండో సంవత్సరం చదవుతున్నాడు. అయితే అతడు తోటి విద్యార్థులు కాలేజ్‌కు వెళ్లాక.. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకన్నాడు. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకన్న పోలీసులు మృతదేహాన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

తల్లిదండ్రులు, బంధువులెవరూ రాక ముందే మృతదేహాన్ని ఆగమేఘాల మీద తరలించడం ఏమిటని పలువురు విద్యార్థులు ప్రశ్నించారు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జేబీఐటీ కళాశాల ఆవరణలో తోటి విద్యార్థులు ఆందో ళనకు దిగారు. విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమంటూ విద్యార్థులు ఆరోపించారు.