అనుమతి లేకుండా చెట్టును నరికిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై సిద్దిపేట మున్సిపల్ కమీషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గాను రూ. 20,000 జరిమానాతో పాటు పర్యావరణానికి నష్టం కలిగించినందుకు మరో 50 చెట్లను నాటి వాటి సంరక్షణా బాధ్యతలను చేపట్టాల్సిందిగా మునిసిపల్ కమీషనర్ రమణచారి ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం పథకం క్రింద మహాశక్తి నగర్, వీధి నెం. 2 లో 4 ఏళ్ల క్రితం నాటిన గుల్ మొహర్ చెట్టును దొంతి నర్సింహా రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎలాంటి అనుమతి లేకుండా నరికివేశారు.
Also Read:హరితహారం మొక్కలు కాపాడలేక...ఏకంగా పదవినే కోల్పోయిన సర్పంచ్
దీని పై హరితాహారం అధికారి సామల్ల ఐలయ్య ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడిపై కమీషనర్ జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమీషనర్ రమణాచారి మాట్లడుతూ, సదరు ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నారని.. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు బోధించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరికాదన్నారు.
సమాజం, పర్యావరణ పరిరక్షణపై అతని బాధ్యతారాహిత్యానికి ఈ చర్య నిదర్శనం అని కమీషనర్ మండిపడ్డారు. కరోనా కాలంలో ఆక్సిజన్ అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇకనైనా చెట్లను విరివిగా నాటుతూ వాటిని పరిరక్షించుకోవాలని రమణాచారి విజ్ఞప్తి చేశారు.