అమీర్ పేట్ లో ఓ వ్యక్తి గన్ తో హల్ చల్ చేశాడు. గన్ చూపిస్తూ, పాదచారులు, వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశాడు.
హైదరాబాద్ : హైదరాబాద్ అమీర్ పేట బిగ్ బజార్ వద్ద ఓ యువకుడు తుపాకీతో హల్ చల్ సృష్టించాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. సాయికుమార్ అనే యువకుడు గన్ చూపిస్తూ రోడ్డు మీద వెళ్లే పాదచారులు, వాహనదారులను బెదరగొట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని స్టేషన్ కు తరలించారు. అతడి నుంచి ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని.. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

