హైద్రాబాద్  నగరంలోని  మూసాపేటలో  గల స్క్రాప్  దుకాణంలో  పేలుడు చోటు  చేసుకుంది. ఈ  పేలుడు లో  ఒకరు మృతి చెందారు.  

హైద్రాబాద్: నగరంలోని మూసాపేటలో గల స్క్రాప్ దుకాణంలో మంగళవారం నాడు తెల్లవారుజామున పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. స్క్రాప్ దుకాణంలో పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.