Asianet News TeluguAsianet News Telugu

సర్దుబాటు తర్వాత ఉద్యోగ భర్తీ , డీఏ విడుదలకు గ్రీన్‌సిగ్నల్: టీజీవోలకు కేసీఆర్ హామీ

టీజీవో (TGO) నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) భేటీ అయ్యారు. జోనల్‌ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు అనంతరం ఏర్పడే ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకొని భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రకటనలు ఇస్తామని కేసీఆర్ చెప్పారని వారు తెలిపారు.  ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరామని... దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు.

tgo leader meets cm kcr at pragati bhabvan over employment notifications
Author
Hyderabad, First Published Nov 11, 2021, 8:37 PM IST

టీజీవో (TGO) నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎం చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. జోనల్‌ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు అనంతరం ఏర్పడే ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకొని భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రకటనలు ఇస్తామని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఉద్యోగులందరూ సహకరించాలని సీఎం కోరినట్టు టీజీవో నేతలు తెలిపారు. ఉద్యోగులకు ఐచ్ఛికాలు ఇచ్చి సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలకు కేటాయిస్తారని, అందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని టీజీవోలు వెల్లడించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరామని... దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు.

ఇటీవల మంత్రి కేటీఆర్ (ktr) మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ (niti asyog) తో పోటు అనేక సంస్థలు తెలంగాణ(telangana) అభివృద్దిని ప్రశంసిస్తున్నాయని  అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల ప్రగతిపై  సోమవారం నాడు   అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా జోనల్ వ్యవస్థను(zonal) తీసుకొచ్చినట్టుగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.స్కిల్, రీస్కిల్, అన్‌స్కిల్ అమలు చేయాల్సిందేనని ఆయన చెప్పారు. ప్రపంచంలో పోటీపడేలా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.హైద్రాబాద్, మేడ్చల్ లో పరిశ్రమలు వస్తే సరిపోదని కేటీఆర్ అన్నారు. అన్ని జిల్లాల్లో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ALso Read:'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '

కరీంనగర్‌లో(karimnagar) ఐటీ హబ్‌ ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ లాంటి పట్టణాల్లో కూడ ఐటీ పరిశ్రమలు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సామాన్యుడికి ఉపయోగపడని టెక్నాలజీ నిష్పలమని కేటీఆర్ చెప్పారు. ప్రపంచం మొత్తం నాలుగో పారిశ్రామిక విప్లవం ముందుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.దేశంలో 67 శాతం జనాభా 35 ఏళ్లలోపు వారేనని మంత్రి తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగు నీటి రంగం అసాధారణ అభివృద్ది జరిగిందని కేటీఆర్ చెప్పారు.ఐటీ రంగంలో అభివృద్ది జరిగిందని బీజేపీ, ఎంఐఎంలు కూడ ఒప్పుకొన్నాయని మంత్రి తెలిపారు.టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 17,300 పరిశ్రమలకు అనుమతిచ్చామని మంత్రి చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios