తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అలీ.. అనంతరం అక్కడి నుంచి సచివాలయానికి చేరుకుని డీ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

కొద్దిరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో మహమూద్ అలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న అలీకి హోంశాఖను కేటాయిస్తూ అదే రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

 

మహమూద్ అలీకి హోంమంత్రిత్వశాఖను అప్పగించిన కేసీఆర్

ప్రమాణ స్వీకారానికి రండి...మహమూద్ అలీకి రాజ్‌భవన్ పిలుపు, 18న విస్తరణ

పట్టాభిషేకం నేడే..కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ ప్రమాణం..?

కేసీఆర్ ప్రధాని కావాలి... మహమూద్ అలీ