తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... దేశ ప్రధాని కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. కేసీఆర్ లాంటి వ్యక్తి దేశ ప్రధాని అయితే.. ముస్లింలు బాగుపడతారన్నారు. 

బుధవారం ఓ మీడియా సంస్థతో మహమద్ అలీ మాట్లాడారు. తెలంగాణలో 90శాతం ముస్లింలు కేసీఆర్ తోనే ఉన్నారన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు ముస్లింలు నమ్మి మోసపోలేదన్నారు. కేసీఆర్ పాలనలో ఓల్డ్ సిటీ గోలడ్్ సిటీగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సమైక్య రాష్ట్రంలో ఓల్డ్ సిటీని బద్నాం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.