తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. తొలుత తనతో పాటు మరో 14 మంది చేత ప్రమాణం చేయించాలని కేసీఆర్ భావించారు.

అయితే చివరి నిమిషంలో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. అయితే తనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని కూడా తనతో పాటే ప్రమాణ స్వీకారం చేయించాలని కేసీఆర్ భావించారు.

ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వంలో తగిన గౌరవం కల్పిస్తానని ప్రకటించిన టీఆర్ఎస్ చీఫ్ అందుకు తగినట్టుగా తన ప్రమాణం రోజునే మైనారిటీ వర్గాలకు చెందిన మహమూద్ అలీకి అవకాశం కల్పించారు. కేసీఆర్ సూచన మేరకు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మహమూద్ అలీకి రాజ్‌భవన్ వర్గాలు కబురు పెట్టాయి. ఇప్పటికే మంత్రిమండలి కూర్పును దాదాపుగా పూర్తి చేసిన కేసీఆర్.. ఈ నెల 18న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలంగాణ భవన్‌లో చర్చ నడుస్తోంది.