తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. తొలుత తనతో పాటు మరో 14 మంది చేత ప్రమాణం చేయించాలని కేసీఆర్ భావించారు.

అయితే చివరి నిమిషంలో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. బుధవారం మధ్యాహ్నాం తెలంగాణ భవన్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే టీఆర్ఎస్ శాసనసభాపక్షనేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. అనంతరం ఈ తీర్మాన ప్రతిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహాన్‌కు అందజేశారు.

అనంతరం కేసీఆర్‌తో పాటు ఆయన మంత్రిమండలిలోని వ్యక్తులు తమ అపద్ధర్మ పదవులకు రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ ఆమోదించారు... కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఎంగా కొనసాగాల్సిందిగా నరసింహన్.. కేసీఆర్‌కు సూచించారు. మరోవైపు కేసీఆర్‌తో పాటు మరొకరు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి అనుగుణంగా రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖ ఆహ్వాన పత్రికలను ముద్రించి, ప్రముఖులకు పంపించింది.

కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రాజ్‌భవన్ ప్రధాన రహదారిని మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు కమిషనర్ ప్రకటించారు.


కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్

కేసీఆర్ మగాడ్రా బుజ్జి

ఓడిపోయినవారిని కేబినెట్‌లోకి తీసుకోను: కేసీఆర్

సోనియా అడిగారు, నేను కాదన్నాను: గుట్టువిప్పిన కేసీఆర్

టార్గెట్ 26: దిగ్గజాలకు చుక్కలు చూపిన హరీష్