హైదరాబాద్: కేసీఆర్ తో పాటు గురువారం నాడు మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్ అలీకి హోంమంత్రి పదవి దక్కింది.

తొలి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మంత్రివర్గంలో మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఎమ్మెల్సీగా ఉన్న మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా కొనసాగారు.కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం నాడు ప్రమాణం చేశారు.

కేసీఆర్ తో పాటు మహమూద్ అలీ ఇవాళ రాజ్‌భవన్ లో ప్రమాణం చేశారు. మహమూద్ అలీకి హోంమంత్రిత్వశాఖను  కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.గత టర్మ్‌లో మమహూద్ అలీ మైనార్టీ, రెవిన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. గత టర్మ్ లో నాయిని నర్సింహరెడ్డి హోంమంత్రిగా పనిచేశారు.

గత టర్మ్‌లో కేటాయించిన డీప్యూటీ సీఎం పదవిని కూడ మహమూద్‌అలీకి కేటాయించారు. డిప్యూటీ సీఎంతో పాటు హోమంత్రిత్వ శాఖను కేసీఆర్ అలీకి కేటాయించారు.