Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్టుల మహాధర్నా నేడే..

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జెఎన్‌జె మ్యాక్ హెచ్‌ఎస్) జర్నలిస్టులు పదహారేళ్ల క్రితం కొనుగోలు చేసిన పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సొసైటీకి కేటాయించాలని కోరుతూ ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ధ దర్నా చౌక్‌లో జర్నలిస్టులు మహాధర్నా నిర్వహించనున్నారు. 

Maha dharna of JNJ members at Indira Park on 18th KRJ
Author
First Published Jul 18, 2023, 1:18 AM IST

సుప్రీంకోర్టు తుది తీర్పు మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ(జేఎన్‌జే మ్యాక్‌ హెచ్‌ఎస్‌) జర్నలిస్టులు దీక్ష ప్రారంభించనున్నారు.  పదహారేళ్ళ  క్రితం కొనుగోలు చేసిన పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సొసైటీకి కేటాయించాలని , ఈ మేరకు ఃజూలై 18వ  తేదీ (మంగళవారం)న హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ధ ధర్నా చౌక్‌లో జర్నలిస్టులు మహాధర్నా నిర్వహించనున్నారు.

ఈ మహాధర్నాకు మద్దతుగా  వివిధ రాజకీయ పార్టీల నేతలు, ‍ప్రజాసంఘాల నేతలు ఈ ధర్నాలో పాల్గొంటున‍్నట్లు జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌ పీవీ రమణారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మహా ధర్నా జరుగుతోందన్నారు. 

సుప్రీం కోర్టు తీర్పు వచ్చి 10 నెలలు గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వం పేట్‌ బషీరాబాద్‌ భూమిని తమ సొసైటీకి స్వాధీనం చేయకపోవడంతో జెఎన్‌జె హౌసింగ్‌ సొసైటీ సభ్యులు ఈ  మహాధర్నా చేపడుతున్నట్లు రమణారావు తెలిపారు.  ఈ మహాధర్నాలో జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ సభ్యులు తమ కుటుంబాలతో పెద్ద సంఖ్యలో పాల్గొంటునట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ సభ్యులు(జర్నలిస్టుల)  18 వ తేదీన ఇందిరాపార్క్‌వద్ద చేస్తున్న మహాధర్నాకు మద్ధత్తుగా విచ్చేస్తున్న వివిధ పక్షాల నాయకుల వివరాలు

కాంగ్రెస్‌...
1. మల్లు రవి, టిపిసిసి సీనియర్‌ ఉపాధ్యక్షులు
2.వి హనుమంతురావు, పిసిసి మాజీ అధ్యక్షులు
3. పొన్నాల లక్ష్మయ్య, పిసిసి మాజీ అధ్యక్షులు
4.పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపి
5.పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపి

బిజెపి
1.ఈటెల రాజేంద్ర, బిజేపి రాష్త్ర ప్రచారకమిటీ ఛైర్మన్‌
2.రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ
3.గీతా మూర్తి, బిజెపి మహిళా మోర్చా రాష్త్ర అధ్యక్షురాలు
4.ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, బిజెపి మాజీ ఎమ్మెల్యే
5.యమునా పాఠక్‌, బిజెపి అధికార ప్రతినిధి
6.రాణి రుద్రమారెడ్డి, బిజెపి అధికార ప్రతినిధి
7. కె.దిలీప్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ
8.బూరా నర్సయ్య గౌడ్‌, మాజీ ఎంపీ

.>> సిపిఎం - డి.జి. నర్సింహరావు, రాష్త్ర కార్యవర్గ మెంబర్‌

>> సిపిఐ - నంధ్యాల నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

>> బిఎన్‌పి - ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, రాష్త్ర పార్టీ అధ్యక్షులు

>> టిజేఎస్‌ - ప్రొఫసర్‌ కొదండరాం, రాష్త్ర అధ్యక్షులు

>> ఎంఐఎం - బలాల్‌, పాషా ఖాద్రీ

>> వైఎస్‌ఆర్‌సిపి - గట్టు రాంచద్రరావు, అధికార ప్రతినిధి

>> ఆప్‌ పార్టీ - రాములు గౌడ్

>> వైసిపి ఎంపి ఆర్‌ క్రిష్ణయ్య

ఇతరులు

>> ఇంధిరా శోభన్‌, విమలక్క - అరుణోదయ్య సాంస్ర్కతిక మండలి, ప్రొఫసర్‌ హరగోపాల్‌, సంధ్య - పిఓడ, 

>> ఏబివిపి - ఝాన్సీ, కరుణాకర్‌,

>> ఏఐఎస్‌ఎఫ్‌ - లక్ఘ్మణ్‌ 

>> ఉద్యోగ సంఘాల నాయకుడు - విఠల్‌

Follow Us:
Download App:
  • android
  • ios