కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు .. అది ఎప్పటికీ జరగదు: టీఆర్ఎస్ వ్యాఖ్యలకు మధుయాష్కీ కౌంటర్

తెలంగాణ (telangana) రాష్ట్రంలో ఏ రోజు కూడా కాంగ్రెస్ (congress) -  బీజేపీ (bjp) ల మధ్య పొత్తు వుండదన్నారు టీ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ (madhu yashki goud ). కొందరు పార్టీలో వుంటూనే టీఆర్ఎస్‌‌ను ఓడించాలనే క్షణికావేశంలో బీజేపీకి మద్ధతు తెలిపి వుండొచ్చని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. 

madhu yashki goud counter to bjp congress coalition

తెలంగాణ (telangana) రాష్ట్రంలో ఏ రోజు కూడా కాంగ్రెస్ (congress) -  బీజేపీ (bjp) ల మధ్య పొత్తు వుండదన్నారు టీ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ (madhu yashki goud ). హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad bypoll) ఫలితాలపై టీపీసీసీ (tpcc) ఈ రోజు గాంధీ భవన్‌లో (gandhi bhavan) సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. కొందరు స్థానికంగా పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే కొందరు పార్టీలో వుంటూనే టీఆర్ఎస్‌‌ను ఓడించాలనే క్షణికావేశంలో బీజేపీకి మద్ధతు తెలిపి వుండొచ్చని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. 

టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో తెలంగాణను దోచుకుంటున్నది దాచుకుంటున్నది కేసీఆర్ (kcr) కుటుంబమే అన్నారు. దీనికి బీజేపీ వత్తాసు పలుకుతున్నారని.. నిన్న కూడా కేసీఆర్ కుటుంబాన్ని బండి సంజయ్ పల్లెత్తు మాట కూడా అనలేదని ఆయన ఎద్దేవా చేశారు. గెలిచిన తర్వాత కూడా టీఆర్ఎస్, కేసీఆర్ పాలనపై ఎలాంటి ఎంక్వైరీలు వేస్తామని కూడా చెప్పలేదని మధుయాష్కీ దుయ్యబట్టారు. కానీ అదే మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మద్ధతుగా వున్న ఎన్సీపీ నాయకులపై ఈడీ నోటీసులు ఇస్తోందని, అరెస్ట్ చేస్తోందని ఆయన ఆరోపించారు. దీనిని బట్టి టీఆర్ఎస్-  బీజేపీ కలిసే వున్నాయని అర్ధమవుతోందని మధుయాష్కీ అన్నారు.

Also Read;Huzurabad bypoll Result 2021: కాంగ్రెస్ ఓటమిపై నివేదిక ఇవ్వాలని ఠాగూర్ ఆదేశం

మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఆదేశించారు. ఈ ఓటమిపై నివేదిక ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  కమిటీని ఏర్పాటు చేసింది. గాంధీ భవన్ లో  బుధవారం నాడు Congress Political Affairs Committee సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ సమావేశం సుధీర్ఘంగా జరిగింది.ఈ సమావేశంలో  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై చర్చించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపైనే పార్టీ నేతలు సీరియస్ గా చర్చించారు.పార్టీ అంతర్గత వ్యవహరాలపై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనే చర్చించాలని పార్టీ నేతలకు మాణికం ఠాగూర్ ఆదేశించారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకపోతే రాహుల్, సోనియాగాంధీతో చర్చించాలని ఆయన సూచించారు. పార్టీలో క్రమశిక్షణ లోపం ఉందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. నేతలతో సమిష్టిగా వ్యవహరించాలని ఠాగూర్ సూచించారు.

2018 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానంలో 61 వేలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంపైనే పార్టీ నేతలు అంతర్గతంగా విశ్లేషించుకొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను చూసిన కొందరు పార్టీ సీనియర్లు Revanth Reddy లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios