Huzurabad bypoll Result 2021: కాంగ్రెస్ ఓటమిపై నివేదిక ఇవ్వాలని ఠాగూర్ ఆదేశం
హుజూరాబాద్ ఓటమిపై నివేదిక ఇవ్వాలని మాణికం ఠాగూర్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. ఎన్నికల్లో ఓటమికి గల పరిస్థితులను నివేదికలో సమగ్రంగా వివరించాలని పార్టీ కోరింది.
హైదరాబాద్:హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఆదేశించారు.ఈ ఓటమిపై నివేదిక ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
గాంధీ భవన్ లో బుధవారం నాడు Congress Political Affairs Committee సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ సమావేశం సుధీర్ఘంగా జరిగింది.ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై చర్చించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపైనే పార్టీ నేతలు సీరియస్ గా చర్చించారు.పార్టీ అంతర్గత వ్యవహరాలపై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనే చర్చించాలని పార్టీ నేతలకు మాణికం ఠాగూర్ ఆదేశించారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకపోతే రాహుల్, సోనియాగాంధీతో చర్చించాలని ఆయన సూచించారు. పార్టీలో క్రమశిక్షణ లోపం ఉందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. నేతలతో సమిష్టిగా వ్యవహరించాలని ఠాగూర్ సూచించారు.
also read:హాట్‌హాట్‌గా కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చ: రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జానా
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానంలో 61 వేలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంపైనే పార్టీ నేతలు అంతర్గతంగా విశ్లేషించుకొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను చూసిన కొందరు పార్టీ సీనియర్లు Revanth Reddy లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
Huzurabad bypoll బల్మూరి వెంకట్ ను రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు బలి పశువును చేశారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ వస్తే రేవంత్ రెడ్డి ప్రతిభ, కాంగ్రెస్ కు డిపాజిట్ రాకపోతే సీనియర్ల తప్పిదమని రేవంత్ అనుచరులు ప్రచారానికి సిద్దమయ్యారని Jagga Reddy మంగళవారం నాడు వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలపై Komatireddy Venkat Reddy సీరియస్ వ్యాఖ్యలు చేశారు. శతృవుకి శతృవు మిత్రుడు.. అందుకే ఈటల రాజేందర్ కు మద్దతిచ్చామన్నారు.ఈ పరిణామాలపై పార్టీ అధినాయకత్వానికి నివేదిక ఇస్తానని ఆయన ప్రకటించారు.
ఈ ఉప ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఈ వ్యాఖ్యలపై ఇవాళ Congress పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత Jana Reddy తప్పుబట్టారు.
పార్టీ ఓటమికి నీవు ఒక్కడితే బాధ్యత ఎలా అవుతుందని జానారెడ్డి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదంతా సమిష్టి బాధ్యత అని ఆయన చెప్పారు. ఈ సమయంలో కొందరు నేతలు మాట్లాడేందుకు చేసే ప్రయత్నం చేయగా జానారెడ్డి సీరియస్ అయ్యారు. తాను మాట్లాడే సమయంలో ఎవరూ అడ్డు రావొద్దన్నారు. తనను మాట్లాడకుండా అడ్డుకొంటే తాను సంతకం పెట్టి సమావేశం నుండి వెళ్లిపోతానని జానారెడ్డి చెప్పారు. దీంతో జానారెడ్డి మాట్లాడేవరకు పార్టీ నేతలు మాత్రం అడ్డు చెప్పలేదు. ఇదిలా ఉంటే జానారెడ్డి వ్యాఖ్యలకు మాజీ కేంద్ర మంత్రి Renuka Chowdhury సమర్ధించారు. పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకోవాలని ఆమె చెప్పారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ మధు యాష్కీ లు హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్లాప్ షోగా విమర్శలు గుప్పించారు. స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడెక్కడ ప్రచారం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు ప్రశ్నించారు.