
Mega Kitchen in Madhira: ఒక్క కిచెన్.. 16 మండలాల పిల్లలకు వేడి భోజనం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వేడి, పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక వంటశాల ద్వారా తొలి దశలో 16 మండలాల ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం అందించనున్నారు. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి శాశ్వత కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.