ఎల్పీజీ సిబ్బందిని ఫ్రంటైలైన్ వారియర్లుగా గుర్తించాలని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. ఎల్పీజీ సిబ్బందికి వ్యాక్సిన్ ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జూన్ 1 నుంచి సిలిండర్ సరఫరా నిలిపివేస్తామని డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించారు. దీంతో వినియోగదారులు గోడౌన్ల నుంచే సిలిండర్లు తెచ్చుకోవాల్సి వుంటుందని వారు తెలిపారు. 

మరోవైపు వంట గ్యాస్ డెలివరీ సిబ్బందిని ఫ్రంట్ లైన్ కార్మికులుగా గుర్తిస్తూ అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేసే బాయ్స్ లను ఫ్రంట్ లైన్ కార్మికులుగా గుర్తించి వారికి త్వరలో కొవిడ్ టీకాలు వేయడం ప్రారంభిస్తామని అసోం సర్కారు ప్రకటించింది.

Also Read:బ్లాక్ ఫంగస్ : వాడిన మాస్కునే.. మళ్లీ వాడితే డేంజర్ లో పడ్డట్టే.. ఎయిమ్స్

ఎల్పీజీ పంపిణీదారులు, వారి సిబ్బందిని సర్కారు ఫ్రంట్ లైన్ కార్మికులుగా గుర్తించింది. ఈశాన్య రాష్ట్రాలైన అసోంతో పాటు మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లలోనూ ఎల్పీజీ డెలివరీ సిబ్బందిని ఫ్రంట్ లైన్ కార్మికులుగా గుర్తించారు.

ఎల్పీజీ సిబ్బందిని ఫ్రంట్ లైన్ కార్మికులుగా గుర్తించినందున వారికి త్వరలో కొవిడ్ వ్యాక్సిన్లు వేస్తాని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశర్మ చెప్పారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి గ్యాస్ సిలిండర్లను ఇళ్లకు డెలివరీ చేస్తున్న సిబ్బందిని మానవతా దృక్పథంతో గుర్తించి వారికి వ్యాక్సిన్ అందిస్తామని సీఎం తెలిపారు.