తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్ర‌తలు ప‌డిపోతున్నాయి. గ‌తంలో ఎన్నాడు లేని విధంగా చ‌లి పంజా విసురుతోంది. హైదరాబాద్ లో దశాబ్దంలోనే డిసెంబర్‌ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో నిన్న ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని మారేడు మిల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. 

Hyderabad weather: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. పగటి పూట‌ కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మ‌రోవైపు.. సాయంత్రం 5 గంటల నుంచే ఉష్ణోగ్ర‌తలు క్ర‌మంగా ప‌డిపోతున్నాయి. దీంతో చలి ప్రభావం మరింత ఎక్కువ అవుతుంది. ఇక తెలంగాణ‌లో గ‌తంలో ఎన్నాడు ఉష్ణోగ్ర‌తలు ప‌డిపోతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు వ‌ర్షాల‌కు త‌డిసిముద్ద‌యినా హైద‌రాబాద్ తాజాగా దట్టమైన మంచు దుప్పటి కప్పుకుంది. దీంతో న‌గ‌ర‌వాసులు చ‌లికి గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. డిసెంబర్ నెలలోనే నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దశాబ్దం కాలంలో డిసెంబర్ నెలలో అత్యంత తక్కువ ఉష్ణోగ్ర‌త న‌మోద‌య్యింది. శనివారం (డిసెంబర్ 18న) హైదరాబాద్ లో నమోదైన కనిష్ణ ఉష్ణోగ్రత ఈ 10 ఏళ్ల లోనే అత్యల్పం అని వాతావరణ విభాగం తెలిపింది. 

శనివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద 8.2 డిగ్రీలు, పటాన్ చెరువులో 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో 2015 డిసెంబర్‌ 13న హైదరాబాద్‌లో అతితక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈసారి 8.2 డిగ్రీలకు పడిపోవడం ద్వారా దశాబ్దంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లయింది. రాబోయే వారం రోజుల్లో న‌గ‌రంలో ఇంకా మూడు నుండి నాలుగు డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ఉపరితల గాలుల గంట‌కు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయ‌నీ, దీని ప్ర‌భావంతో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతున్న‌ట్టు అధికారులు తెలుపుతున్నారు. అలాగే.. డిసెంబర్ 21 వరకు నగరంలో ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో రాబోయే రోజుల్లో చలి తీవ్ర‌త మ‌రింత పెరుగ‌నున్న‌ద‌నీ, ఉష్ణోగ్ర‌తలు ఇంకాస్త దిగ‌జారనున్నాయని వాతావర‌ణ అధికారులు హెచ్చరిస్తోన్నారు. ఆ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read Also: అలా చేస్తే.. శాశ్వతంగా రాజకీయాలకు దూర‌మ‌వుతా.. Paritala Sriram సంచలన వ్యాఖ్యలు

అలాగే.. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఉష్ణోగ్ర‌తలు 2 నుంచి 4 డిగ్రీల మేర త‌గ్గ‌బోతున్న‌ట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్త‌ర తెలంగాణ‌లో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌తలు ప‌డిపోతాయ‌ని.. మ‌రి ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు, మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లెలో 7.1 డిగ్రీలు, జహీరాబాద్‌ మండలం సత్వార్‌ గ్రామంలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

Read Also: కర్నూలు వైసీపీలో వేడెక్కిన రాజకీయం : జడ్పీ ఛైర్మన్ రాజీనామా.. జగన్ ఒత్తిడితోనేనా..?

ఏపీలో కూడా ఉష్ణోగ్ర‌తలు ప‌డిపోతున్నాయి. గ‌త కొన్నిరోజులుగా రాష్ట్రంలో వ‌రుస‌గా ఉష్ణోగ్ర‌తలు ప‌డిపోతున్నాయి. ప‌గ‌టివేళ కూడా చల్ల‌నిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్ర‌జలు ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా తూర్పు మన్యంలోని మారేడుమిల్లిలో చలితీవ్రత ఎక్కువగా ఉంది. మారేడు మిల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.ఈ ఏడాది ఇదే అత్యల్పం. చలి తీవ్రత తగ్గకపోవడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చ‌లి తీవ్ర‌త మ‌రింత పెరుగనున్న‌దని అధికారులు హెచ్చ‌రిస్తోన్నారు. మరోవైపు విశాఖ ఏజెన్సీలో కూడా ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. గ‌త వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయిపోయాయి.