Asianet News TeluguAsianet News Telugu

తేలిపోతున్న తెలుగు రాష్ట్రం

2016  ఫుల్ గా కిక్ ఇచ్చింది. కొత్త సంవత్సరం మత్తెక్కిస్తూ ఉంది. భవిష్యత్తులో రాష్ట్రం మరింత హాయిగా హూశారుగా తూలుతూ తేలుతూ సాగిపోవడం గ్యారంటీ.

 

liquor sales surging in Telangana

తెలంగాణా ప్రభుత్వానికి 2017 అక్షరాలా హ్యాపీ న్యూ ఇయరే.

 

కొత్త సంవత్సరం మత్తెక్కిస్తూ ఉంది. భవిష్యత్తులో రాష్ట్రం మరింత హాయిగా హూశారుగా తూలుతూ తేలుతూ సాగిపోవడం గ్యారంటీ. 2016  ఫుల్ గా కిక్ ఇచ్చింది.

 

తెలంగాణాలో 2016 జనవరి 1 నుంచి డిసెంబరు 31 గా చీర్సే చీర్స్. మద్యం ప్రియులు మునుపెన్నడు లేనంతగా మజా చేసుకున్నారు. ముఖ్యంగా బీర్ ప్రియుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. నీళ్లు, టీ  తర్వాత తెలంగాణాలో ఎక్కువ తాగింది... పళ్ల రసాలు, కూల్ డ్రింక్స్  కాదు, బీరూ మద్యమే.

 

 2016లో తెలంగాణ రాష్ట్రంలో 3,41,93,396 బీరు కేసులు అమ్ముడుయాయి. మద్యం (ఐఎంఎఫ్‌ఎల్‌) 2,71,59,026 కేసులు  మాత్రమే అమ్ముడయ్యాయి. మామూలు మద్యం కంటే బీర్  70,34,370 కేసులు ముందుంది.

 

జనాభాపరంగా చూస్తే బీరు తలసరి వినియోగం 11 కేసులు గా ఉంది. గత ఏడాది ఇది 8 మాత్రమే. మొత్తంమీద 2016 డిసెంబరు 31వ తేదీతో ముగిసిన సంవత్సరంలో తెలంగాణాలో  రూ.14,075 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

 

జిల్లాల వారీగా తీసుకుంటే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.3,337 కోట్ల మద్యం లాగించేశారు. రూ.1,490 కోట్ల అమ్మకాలతో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది.  రెండో రాజధాని హోదా కోసం పోటీ పడుతున్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా మద్యం అమ్మకాల్లో కూడా  హైదరాబాద్‌తో పోటీ పడుతోంది. ఇక్కడ మొత్తం రూ.1,488 కోట్ల అమ్మకాలు జరిగాయి.

 

రాష్ట్రంలో సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబరు 30, 31 తేదీల్లో రూ.175 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. పెద్దనోట్ల రద్దు, చిల్లర సమస్య రాష్ట్రాన్ని పీడించినా, కిక్క తగ్గలేదు. చిల్లర సమస్య మందును తాకలేదు.

 

ఈ ఉత్సాహంతో  అలాగే ముందుకు సాగిపోవాలని ఎక్సయిజ్ అధికారులు చూస్తున్నారు. మద్యం, బీరు సరఫరాను తెలంగాణా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇపుడు బజార్ల దుకాణాలకే పరిమితమయిన మందును ఇపుడుమాల్స్ లో కూడా అందుబాటులో కి తెస్తున్నారు. వచ్చే అర్ధిక సంవత్సరంలో అన్ని మాల్స్ లో లిక్కర్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. హోం డెలివరీ కూడా ఉండవచ్చని అంటున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios