హైదరాబాద్‌లో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు
heavy rains: హైదరాబాద్‌లో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. శనివారం అరగంట పాటు కురిసిన వర్షంతో అత్తాపూర్‌లో వరదలు పోటెత్తడంతో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Hyderabad rains: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. రాష్ట్రరాజధాని హైదరాబాద్ లో కూడా ఈ వారం రోజుల మాదిరిగానే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం కూడా భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ ప్రాంతాన్ని మేఘాలు కప్పివుంచాయి. పలు చోట్ల భారీ వర్షం కురవడంతో వరదలు సంభవించాయి. సంధ్యా సమయం సమీపిస్తున్న కొద్దీ, నగరం, దాని శివారులోని పలు ప్రాంతాలలో జల్లులు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఐఎండీ-హైదరాబాద్ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం, సోమవారం రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు సైతం కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ క్రమంలోనే రెండింటికీ పసుపు హెచ్చరికలను జారీ చేసింది, కాగా, పసుపు హెచ్చరికలు ఉరుములు మెరుపులతో కూడిన వానలు, అప్పుడప్పుడు తీవ్రమైన కాలాలను పరిస్థితులను సూచిస్తుంది.
కూకట్‌పల్లి, మాదాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, మెహిదీపట్నం, అత్తాపూర్, జూబ్లీహిల్స్, టోలీచౌకి, షేక్‌పేటలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విభాగం ప్రకారం, మాదాపూర్‌లో అత్యధికంగా 78.8 మిల్లీ మీటర్ల వర్షపాతం, జూబ్లీహిల్స్‌లో 76.5 మిల్లీ మీటర్లు, హఫీజ్‌పేటలో 60.3మిల్లీ మీటర్లు, షేక్‌పేట్‌లో 49.8 మిల్లీ మీటర్లు, మియాపూర్‌లో 46.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) డేటా ప్రకారం జూబ్లీ హిల్స్, మాదాపూర్ రెండూ వరుసగా 46.3, 43.3 మిల్లీమీటర్ల సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యాయి. నగరంలో గరిష్ట-కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31.2 డిగ్రీల సెల్సియస్, 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
శనివారం కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. టీఎస్‌డీపీఎస్ సమాచారం ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వెలుపల అత్యధికంగా నిజామాబాద్‌లోని కోరట్‌పల్లిలో 34.8మిల్లీ మీటర్ల వర్షపాతం, ఖమ్మంలోని ఖాన్‌పూర్‌లో 32.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఐఎండీ-హైదరాబాద్ ప్రకారం, రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రం మొత్తానికి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ.. పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఇక అత్తాపూర్‌లో అరగంట పాటు కురిసిన వర్షానికి వరదనీరు పోటెత్తడంతో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీటి ద్వారా ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
24 గంటల వ్యవధిలో నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల ఒక్కొక్కటి రెండు గేట్లను తెరిచి ఉంచింది. జలాశయానికి ఇప్పటి వరకు 450 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 467 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది.