కొందరు కావాలనే బీజేపీపై సోషల్ మీడియాలో బురదజల్లుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. దీనిని ఉపేక్షించకూడదని కార్యకర్తలకు సూచించారు. 

ఐక్యంగా పోరాడి బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు తరువాత ఆయన మొదటిసారిగా గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బీజేపీపై కొందరు కావాలనే బురదజల్లుతున్నారని అన్నారు. కానీ తాము ఏ పార్టీతోనూ లేమని స్పష్టం చేయాలని అనుకుంటున్నామని తెలిపారు.

స్థలం కబ్జా చేశారని తండ్రి ఫిర్యాదు, కూతురిపై వేధింపులు.. పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితురాలి ఆత్మహత్య..

వారసత్వ రాజకీయాలు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇక్కడకు వచ్చామని తెలిపారు. అవినీతి బీఆర్ఎస్ బారి నుంచి తెలంగాణను విముక్తి చేస్తామని అన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అధికారాన్ని పంచుకున్నాయని గుర్తు చేశారు. పొత్తులు పెట్టుకున్నాయని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని, దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ టికెట్లపై గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రులుగా మారిన వారు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

పోటీ మంచిదే.. కానీ మోసం మంచిది కాదు.. థ్రెడ్స్ యాప్ విషయంలో మెటాపై దావా వేస్తామని హెచ్చరించిన ట్విట్టర్

కాంగ్రెస్ తన జోరును నిలుపుకోలేకపోయిందని కిషన్ రెడ్డి అన్నారు. శాసన మండలిలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీలో కొనసాగలేదని విమర్శించారు. అలాంటి వారు రహస్య ఒప్పందాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి అవగాహన పొత్తు లేదనీ, భవిష్యత్తులో కూడా లేదని అన్నారు. తొమ్మిదేళ్లుగా సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని తెలిపారు.

పసి బిడ్డతో తల్లి కష్టం... కరిగిన నెటిజన్ల హృదయం..!

అనంతరం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శిష్యుడినని చెప్పారు. యువజన విభాగం రోజుల్లో కిషన్ రెడ్డి తమకు అండగా నిలిచారని అన్నారు. తనకు, కిషన్ రెడ్డికి, ఇతర నేతలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉపేక్షించవద్దని విజ్ఞప్తి చేశారు. దీన్ని కొందరు ప్రత్యర్థి నేతలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఐక్యంగా పోరాడి బీఆర్ఎస్ ను గద్దె దింపుదామని చెప్పారు.