ఆమె పడుతున్న కష్టాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఆమె పడుతున్న కష్టానికి నెటిజన్ల హృదయం కరిగిపోయింది.

బిడ్డల కోసం తల్లి చాలా కష్టపడుతుంది. తన కడుపు నిండకపోయినా, తన బిడ్డల ఆకలి తీర్చాలని అనుకుంటుంది. తాజాగా ఓ తల్లి చేతిలో పసి బిడ్డను పెట్టుకొని, జీవించడం కోసం కష్టపడుతోంది. నెలల బిడ్డను వడిలో పెట్టుకొని జీవనోపాధి కోసం రిక్షా తొక్కుతోంది. ఆమె పడుతున్న కష్టాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఆమె పడుతున్న కష్టానికి నెటిజన్ల హృదయం కరిగిపోయింది.


ఈ-రిక్షా డ్రైవర్‌గా ఉన్న తల్లికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్‌లో ఈ వీడియోని షేర్ చేశారు. మహిళ తన వాహనంలో కూర్చొని కస్టమర్‌లతో బేరసారాలు సాగిస్తున్నట్లు వీడియోలో చూపించారు.. నిశితంగా పరిశీలించిన తర్వాత, మీరు ఆమె ఒడిలో ఒక చిన్న పిల్లవాడిని చూడగలరు. కొన్ని క్షణాల తర్వాత, ఆ స్త్రీ అక్కడి నుండి దూరంగా వెళ్లి, పిల్లవాడిని తన ఒడిలో జాగ్రత్తగా ఉంచుకుంది.

View post on Instagram

ఈ వీడియోకు టన్నుల కొద్దీ స్పందించారు. వ్యూస్ కూడా లక్షల్లో వచ్చాయి. ఆమె పడుతున్న కష్టానికి, ఆమె తల్లి మనసుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె పాదాలకు నమస్కారం చేసినా తప్పులేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంక, చాలా మంది ఆమెకు వీలైనంత సహాయం చేయాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని కామెంట్స్ చేయడం విశేషం. మహిళ వివరాలు తెలిస్తే, తాము ఆర్థిక సహాయం చేస్తామని చాలా మంది ముందుకు రావడం విశేషం.