నోట్ల రద్దుపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్  

నోట్ల రద్దు తరువాత పార్టీల అసలు రంగు బయటపడిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దుపై విపక్షాలు ఆందోళచేయడం సరికాదన్నారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నల్లధనంపై చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. నోట్ల రద్దుపై ముందస్తు సమాచారం ఇవ్వలేదనడం హాస్యాస్పదమని, ముందస్తు సమాచారమిస్తే దొంగలు జాగ్రత్తపడేవారని పేర్కొన్నారు.