సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తా: లాస్య నందిత సోదరి నివేదిత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబం నుండి ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగనున్నట్టుగా దివంగత లాస్యనందిత సోదరి నివేదిత చెప్పారు.ఈ ఏడాది ఫిబ్రవరి 23న పటాన్ చెరు ఔటర్ రింగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత రాష్ట్ర సమితికి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు.
also read:క్లాస్‌రూమ్‌లో టీచర్ డ్యాన్స్: వీడియో వైరల్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది మే 13న కూడ పోలింగ్ జరగనుంది. ఈ స్థానం నుండి లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేయనున్నారు.శనివారం నాడు తన నివాసంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో నివేదిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో తాను ఎన్నికల బరిలోకి దిగనున్నట్టుగా ప్రకటించారు.లాస్య నందిత మరణంతో నివేదిత ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
also read:హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ (వీడియో)
2023 ఫిబ్రవరి మాసంలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో 2023 నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి లాస్య నందితను బీఆర్ఎస్ బరిలోకి దింపింది.ఈ స్థానం నుండి లాస్య నందిత విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొన్ని రోజులకే ఓ కార్యక్రమంలో పాల్గొన్న లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. ఈ ప్రమాదం నుండి ఆమె సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 13న నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ సభకు తిరిగి వస్తున్న సమయంలో లాస్య నందిత కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుండి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం నుండి బయటపడిన పది రోజులకే పటాన్ చెరు వద్ద ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందారు.
also read:వెరైటీ పెళ్లి పత్రిక: విత్తనాలను పంచుతున్న ఆదిలాబాద్ వాసి
దీంతో ఈ ఏడాది మే 13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుండి లాస్యనందిత సోదరి నివేదిత బరిలోకి దిగనున్నారు. ఈ విషయమై బీఆర్ఎస్ నాయకత్వం కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. దరిమిలా నివేదిత బీఆర్ఎస్ శ్రేణులు, తన తండ్రి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఇతర పార్టీలు కూడ సహకరించాలని ఆమె కోరారు.గత ఏడాది నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.