Asianet News TeluguAsianet News Telugu

మరొక జాతీయ రికార్డు సృష్టించనున్న తెలంగాణా

చాలా  రాష్ట్రాలలో  సిఎం నివాసాలన్నీ పాత భవనాలే.  తమిళనాడులో అధికారిక నివాసమే లేదు. కర్నాటక, బీహార్, యుపి, మహారాష్ట్రలలో గత సిఎం ల భవనాలనే  కొత్త సిఎంలు  ఎంచుకున్నారు. కేరళ సిఎం క్లిఫ్ హౌస్ లో చేరిన విషయం మీడియాకు కూడా తె లియదు.

largest CM residence in country

తెలంగాణా మరొక జాతీయ రికార్డు సృష్టించబోతున్నది.

 

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొత్త అధికార నివాసంలో చేరగానే, అది భారత దేశంలో అతిపెద్ద  ముఖ్యమంత్రి అధికారం నివాసం అవుతుంది. ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రికి ఇంతటి విశాల ప్రాంగణంలో, కనివిని ఎరుగని కార్పెట్ ఏరియాలో  అధికార నివాసం లేదు. నవంబర్ నాలుగోవారం లో  కెసిఆర్ అందులో కాలుపెట్టగానే ఇదొక రికార్డు అవుతుంది. ఇప్పటికే భారీ నిర్మాణాలతో దేశం  దృష్టిని తెలంగాణా ఆకట్టుకుంటూ ఉంది. టి.హబ్ ఒక రికార్డు.

 

చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు నివాసాలు బ్రిటిష్ వారి కట్టినవో లేక స్వాత్రంత్య్రం వచ్చిన వెంటనే కట్టినవి.  ఇటీవల కాలంలలో నిర్మించిన  అధికార నివాసాలలో బేగంపేటలో  ఉమ్మడి రాష్ట్ర కాలంలో రాజశేఖర్ రెడ్డి కట్టించిన క్యాంఫ్ అఫీసే అధునాతనమయినది.

 

తమిళనాడులో ముఖ్యమంత్రికి అధికార నివాసం లేదు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన గోపాల పురం నివాసాన్నే క్యాంప్ ఆపీస్ గా  మార్చుకున్నారు.  జయలలిత ముఖ్యమంత్రి అయినపుడల్లా పోయస్ గార్డెన్లోని  81/36  ఇంటినే అధికార నివాసం చేసుకున్నారు. ఇందులో ఉంటున్నపుడే అమెకు కష్టాలొచ్చాయి. అరెస్టయ్యారు. జైలు కెళ్లారు. అయినా, ఆ భవనాన్ని అమె మార్చాలనుకోక పోవడం విశేషం.

largest CM residence in country

 

 ఇక కేరళ ముఖ్యమంత్రి నివాసం క్లిఫ్ హౌస్(పై ఫోటో). పురాతన మయిన క్లిఫ్ హౌస్ కు హడావిడిగా రిపేర్లు చేయించి ముఖ్యమంత్రి పినరాయి రవి  గృహ ప్రవేశం చేశారు. ఆయన రాక కోసం  బెడ్ రూం ను వర్షాకాలంలో కార కుండా చేయడమే పెద్ద రిపేరట. ఆయన పాత క్యాంప్ ఆఫీసులో చేరడమే కాదు, ఇళ్ల మర మ్మతుల మీద భారీగా ఖర్చే చేయవద్దని  మంత్రుల మీద ఆంక్షలు విధించారు.    పాలుపొంగించడం,సత్యనారాయణ వృతం చేయలేదు. విశేషమేమిటంటే, ఆయన గృహ ప్రవేశం చేసిన విషయం  కుటుంబ సభ్యులు ఫేస్ బుక్ లో పోస్టుచేసే దాకా మీడియా కూడా తెలియదు.

 

కర్నాటక విషయాని కొస్తే ఇటీవల దాకా ముఖ్యమంత్రులంతా విశాలమయిన పాత  క్యాంప్ ఆఫీస్ ’అనుగ్రహ’ లోనే ఉండేవారు. అయితే, బాగా వాస్తు భయం ఉన్నబిజెపి ముఖ్యమంత్రి  యడ్యూరప్ప మాత్రం అనుగ్రహ వదిలేసి  నెంబర్ 2, రేస్ కోర్స్ రోడ్ సొంత ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నారు. అయినా ఆయన్ను కష్టాలు వదల్లేదు. పదవి , పరువు పోయాయి. ఆయన తర్వాత వచ్చిన సదానంద గౌడ  మాత్రం అనుగ్రహ నివాసే.కాకపోతే, అన్నిపూజలు, యాగాలు చేసి పకడ్బందీ గా గృహ ప్రవేశం చేశారు. అంత చేసినా ఆయన పట్టమని ఒక ఏడాది కూడా పదవిలో ఉండలేకపోయారు. తర్వాత బిజెపి మూడో ముఖ్యమంత్రిగా వచ్చిన జగదీష్ షెట్టర్ స్పీకర్ అధికారిక నివాసమయిన ’కావేరి’ని క్యాంప్ ఆపీష్ చేసుకున్నారు. ఎందకంటే, స్పీకర్ గా ఉన్నపుడు కూడా ఆయన అందులో నివసించేవారు.  అచ్చొంచిందని ముఖ్యమంత్రిగా దానినే ఎంచుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కొద్ది మార్పులు చేసి అదే కావేరిలోనే స్థిరపడ్డారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మలబార్ హిల్స్ లోని పాత ముఖ్యమంత్రి అధికార నివాసం ’వర్ష’లోనే ఉండాలనుకున్నారు. 12 వేల చదరపుఅడుగుల కార్పెట్ ఏరియా ఉన్న వర్ష లో  ఆపీస్ , సందర్శకుల గది, సమావేశం మందిరం, ప్యాంట్రీ కూడా ఉంటాయి. మరొక పెద్ద రాష్ట్రం ఉతర ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా కొంత అధికార నివాసం మార్చాలనుకోలేదు.  అంతకు ముందు బిఎస్ పి  ముఖ్యమంత్రి మాయావతి ఉన్న 5, కాళిదాస్  మార్గ్  నివాసంలోనే కొనసాగుతున్నారు. మాయావతికి అధికారంలో ఉన్నపుడు వచ్చిన కఫ్టాలు, అవినీతి కేసులు, తర్వాత పార్టీలో చీలికలు, ఆతర్వాత ఎన్నికల్లోల ఓడిపోవడం గురించి అఖిలేష్ ఆలోచించనే లేదు. ఆ శని తనకూ పడుతుందేమోననే భయం లేకుండా   ముఖ్యమంత్రి అధికారంనివాసం కాబట్టి అందులోనే సెటిలయ్యారు.

largest CM residence in country

బీహార్ ముఖ్యమంత్రి  నితిశ్ కుమార్ పురాతన ముఖ్యమంత్రి అధికార నివాసం 1, అనెయ్ మార్గ్ (పై ఫోటో)లోనే నివసిస్తున్నారు. అంతకుముందు   అందులో  తన ప్రత్యర్థి లాలూ ప్రసాద్, తర్వాత ఆయన భార్య రబ్డీదేవి ఉండేవారు.వారు దానిని పశువుల శాలగా మార్చారని విమర్శలొచ్చాయి, అందులో ఉంటున్నపుడే  లాలూకు అష్ట కష్టాలు మొదలయి, చివరకు జైలుకు పోయి, పార్లమెంటు సభ్యత్వంకూడా పోగొట్టు కోవలసి వచ్చింది. అయినా నితిశ్ మాత్రం జంకలేదు. అందులోనే దిగారు. ఇపుడు ఆ విశాలమయిన క్యాంప్ ఆఫీస్ అవరణలో ఔషధ ,సుగంధ మొక్కలు పెంచి, దానిప్రాముఖ్యం రెట్టింపు చేశారు. పూర్వ పు ముఖ్యమంత్రులు  బిందేశ్వర్ దుబే, భగవత్ ఝా అజాద్,  సత్యేంద్ర నారాయణ్ సిన్హా  ,   నితిష్ కుముందు ఆయన మిత్రుడు జితన్ రామ్ మాంఝి కూడ కొద్ది రోజులు అందులో ఉన్నారు. భగవత్ ఝా అజాద్ మొదలు కుని ఇప్పటి దాకా ఇందులో ఉంటూ కష్టాల పాలవని ముఖ్యమంత్రు లెవరూ లేరు. కొందరి రాజకీయాలు ఈ ఇంటితో ముగిశాయి. కొందరు జైలు కెళ్లారు. కొంతమంది అర్థాంతరంగా పదవులు కోల్పోయారు. అయితే, ఎవరూ ఈ బంగళా వదిలేసి మరొక చోటికి వెళ్లాలను కోకపోవడం విశేషం.

 

హైదరాబాద్ హౌస్

 

ఢిల్లీలోని విలాసవంతమయిన కట్టడాలలో రాష్ట్రపతి భవన్ తర్వాత పేరు పొందింది హైదరాబాద్ నవాబ్  కోసం నిర్మించిన హైదరాబాద్ హౌసే.  1911 లో ఢిల్లీకి రాజధాని వచ్చాక, దేశంలోని పెద్ద సంస్థానాలన్నింటికి ఇప్ప టి రాష్ట్ర పతి భవన్ దారిదాపుల్లో చాలా మంది బంగళాలు వచ్చాయి. దేశంలోని సంస్థానాల సమస్యలు, రాజావారి సమస్యలు చర్చేందుకు 1920 లో ఏర్పాటయిన ఛేంబర్ ఆప్ ఫ్రిన్సెస్ ఏర్పాటు చేసి వారి కోసం ఈ బంగాలు నిర్మించారు. ట్రావన్కోర్ హౌస్, మండిహౌస్, కపుర్తాలా హౌస్,  బరోడా హౌస్, జైపూర్ హౌస్ ..ఇలా మహారాజాల భవనాలెన్ని ఉన్నా, నిజాం కోసం నిర్మించిన హైదరాబాద్ హౌస్ మాత్రమే ఇప్పటికీ ప్రతిష్టాత్మకంగా మిగిలి ఉంది. ఇపుడు విదేశీ వ్యవహారాల శాఖ ఆధీనంలో ఉన్న  హైదరాబాద్ హౌస్ ని ఒకపుడు ఇందిరాగాంధీ ప్రధాని అధికార నివాసం చేసుకోవాలని కూడా భావించారట.ఇపుడిది ఇతర దేశాధ్యక్షులు ఢిల్లీ కొచ్చినపుడు జరిగే విందులకు, సమావేశాలకుఉద్దేశించారు.

 

ఇపుడు  ముఖ్యమంత్రి కొత్త నివాసం, అధునిక హైదరాబాద్ హౌస్ కానుంది. దాదాపు తొమ్మిదెకరాల ప్రాంగణంలో దాదాపు ఒక ఎకరా విస్తీర్ణయంలో వస్తున్న  ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో 80 వేల చదరపుటడుగుల జాగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 200 కార్ల పార్కింగ్ జాగా, 1000 మంది కూర్చునేందుకు వీలుగా ఒక కాన్ఫరెన్స్ హాలు కూడా ఉంటాయి.  నవంబర్ 24న ముఖ్యమంత్రి ఇందులో కాలుమోపగానే, భారత దేశంలో అత్యంత అధునికమయిన,  విశాలమయిన, విలాసవంతమయిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఇదే అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios