Asianet News TeluguAsianet News Telugu

నాకు వరమిచ్చారు: రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కుమారీ ఆంటీ

పాత స్థలంలోనే  ఫుడ్ బిజినెస్ నడుపుకొనేందుకు  తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో  కుమారీ ఆంటీ  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు.

Kumari Aunty Thanked to Telangana chief Minister  Anumula Revanth Reddy lns
Author
First Published Jan 31, 2024, 4:17 PM IST

హైదరాబాద్: పాత స్థలంలోనే   ఫుడ్ బిజినెస్  చేసుకొనేందుకు  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వడంపై  కుమారీ ఆంటీ స్పందించారు.తనకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  వరం ఇచ్చారన్నారు. తాను తిరిగి అదే స్థలంలో ఫుడ్ బిజినెస్ చేసుకొనేందుకు అవకాశం కల్పించిన  కుమారీ ఆంటీ  సీఎం కు  ధన్యవాదాలు తెలిపారు.

also read:కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్: రాజకీయ రచ్చ, టీడీపీ -జనసేనపై వైఎస్ఆర్‌సీపీ ఫైర్

అంతేకాదు  తాను బతికున్నంత కాలం రేవంత్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటానని చెప్పారు.ఆయన రుణం మర్చిపోలేనన్నారు. 
ధన్యవాదాలు చెప్పారు.తన స్టాల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వస్తే  ఆయనకు ఇష్టమైన ఫుడ్ చేసి పెడతానని  కుమారీ ఆంటీ  చెప్పారు.

also read:దేశంలోనే సెకండ్ ప్లేస్: నేడు వివాదాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్

ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందనే  కారణంగా  కుమారీ ఆంటీ  ఫుడ్ బిజినెస్ ను హైద్రాబాద్ పోలీసులు క్లోజ్ చేయించారు. కుమారీ ఆంటీ ఫుడ్ వ్యాన్ ను కూడ పోలీసులు సీజ్ చేశారు. ఈ విషయమై  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున  చర్చ సాగింది.దరిమిలా  బుధవారం నాడు  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్పందించారు.  పాత స్థలంలోనే  కుమారీ ఆంటీ  తన ఫుడ్ బిజినెస్ ను కొనసాగించేందుకు  అనుమతిని ఇచ్చారు. కుమారీ ఆంటీ పై నమోదైన కేసు విషయంలో పున:పరిశీలించాలని కూడ  పోలీసులను సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. 

also read:కుమారీ ఆంటీ‌కి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: పాతస్థలంలోనే ఫుడ్ బిజినెస్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

సీఎం ఆదేశాలను గౌరవించాలని స్ట్రీట్ సైడ్ వ్యాపారాలు చేసుకొనే  వారికి కుమారీ ఆంటీ  సూచించారు. బుధవారంనాడు ఆమె మీడియాతో మాట్లాడారు.సోషల్ మీడియాతో లాభం ఉంది.. నష్టం కూడా ఉందన్నారు.  తన ఫుడ్ బిజినెస్ పెరగడానికి  మీడియా కారణమని ఆమె గుర్తు చేశారు.  తన ఫుడ్ బిజినెస్ సెంటర్ వద్ద  ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకుంటానని  కుమారీ ఆంటీ  చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios