కుమారీ ఆంటీకి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: పాతస్థలంలోనే ఫుడ్ బిజినెస్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
హైద్రాబాద్ మాదాపూర్ లో గతంలో నిర్వహించిన స్థలంలోనే కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ నిర్వహించుకొనేందుకు తెలంగాణ సర్కార్ అనుమతిని ఇచ్చింది.
హైదరాబాద్: కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ పై నమోదు చేసిని కేసును పున:పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో నిర్వహించిన స్థలంలోనే కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ మేరకు ఎంఏయూడీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని సీఎంఓ తెలిపింది.త్వరలోనే కుమారీ ఆంటీ ఫుడ్ సెంటర్ ను తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి సందర్శించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడకు చెందిన కుమారీ ఆంటీ హైద్రాబాద్ మాదాపూర్ లో స్ట్రీట్ సైడ్ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. అనతికాలంలోనే ఈ బిజినెస్ బాగా ప్రాచుర్యం పొందింది. సందీప్ కిషన్ తన సినిమా యూనిట్ తో కలిసి కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ తిన్నారు. సోషల్ మీడియాలో కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కు బాగా ప్రచారం లభించింది.
అయితే దీంతో ఇక్కడ ఫుడ్ తినేందుకు జనం పెరిగిపోయారు.రోడ్డు పక్కనే ఉండడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది. దరిమిలా పోలీసులు కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ను క్లోజ్ చేయాలని ఆదేశించారు.ఆమెపై కేసు కూడ పెట్టారు.
also read:కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్: రాజకీయ రచ్చ, టీడీపీ -జనసేనపై వైఎస్ఆర్‌సీపీ ఫైర్
ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయమై విమర్శలు చేసింది. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు తెలంగాణ సర్కార్ సహాయంతో కుమారీ ఆంటీపై దాడి చేయించారని వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయమై మూడు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి.
ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా సీఎంఓ వర్గాలు తెలిపాయి. కుమారీ ఆంటీ గతంలో ఏ స్థలంలో ఫుడ్ బిజినెస్ నిర్వహించిందో అదే స్థలంలో ఫుడ్ బిజినెస్ నిర్వహించుకొనేందుకు అవకాశం కల్పించింది.కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ను క్లోజ్ చేయాలని పోలీసులు ఆదేశించడంపై సోషల్ మీడియాలో రచ్చ సాగింది. అయితే ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.