హైదరాబాద్‌: కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన హేమంత్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి కోసమే హేమంత్ సతీష్ ను అంతమెుందించాడని పోలీసులు నిర్ధారించారు.  

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సతీష్ కు హేమంత్ చిన్నానటి స్నేహితుడు. కూకట్ పల్లి కేపీహెచ్ బీ 7వ ఫేజ్ లో ఉంటున్నారు. అయితే హేమంత్ ప్రియురాలు ప్రియాంక. ఆ ప్రియాంకను సతీష్ ట్రాప్ చేశాడని హేమంత్ ఆరోపించాడు. 

ప్రియాంక సతీష్ కు దగ్గర అవ్వడంతో తట్టుకోలేకే హేమంత్ సతీష్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే సతీష్ ను ఇంటికి రప్పించి హేమంత్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే హేమంత్ ప్రియురాలు ప్రియాంకను సైతం పోలీసులు విచారించారు. 

పోలీసుల విచారణలో మెుదట హేమంత్ కు సతీష్ కు ఆర్థికపరమైన గొడవలు ఉన్నాయని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టేసరికి అసలు విషయం కక్కేసింది. సతీష్ తనకు దగ్గరవుతున్నాడన్న కసితోనే హేమంత్ హత్య చేసినట్లు తెలిపింది.  

అయితే హత్య అనంతరం హేమంత్ పరారయ్యాడు. హేమంత్ కోసం రెండు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఏపీలో ఉన్నాడని తెలియడంతో కూకట్ పల్లి పోలీసులు అక్కడ హేమంత్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చారు. హత్య సమయంలో మరో మహిళ ఉన్నట్లు స్థానికులు చెప్పడంతో పోలీసులు ఆ మహిళపై ఆరా తీస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య