Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెసోళ్లకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన కేటిఆర్

  • ఇక అలా చేస్తే అస్సలు వదిలిపెట్టను
  • మీరు మార్చుకోకపోతే మీ సంగతి చెప్తా
KTR warns Congress for calling him bachcha

తండ్రి చాటు బిడ్డ రాజకీయాల సీన్ ఎప్పుడో దాటేశారు ఐటి మంత్రి కేటిఆర్. తాజాగా ఆయనే టిఆర్ఎస్ శ్రేణులకు ఎక్కువ సందర్భాల్లో దిశా నిర్దేశం చేస్తున్నారు. మొన్నటికి మొన్న తుంగతూర్తి సభలో కాంగ్రెస్ పై కాలు దువ్వారు కేటిఆర్. కాంగ్రెస్ ను తుంగతూర్తి వేదికగా కడిగి పారేశారు.

దీంతో కాంగ్రెస్ కేటిఆర్ మీద ఇంతెత్తున లేచింది. నువ్వొక బచ్చా అంటూ తీవ్రమైన విమర్శలకు దిగింది. పనిలో పనిగా కేసిఆర్ సచివాలయం రాడు, ఫామ్ హౌస్ లో కానీ, ప్రగతిభవన్ లో కానీ ఉంటాడంటూ కేటిఆర్ తండ్రి మీద కూడా గట్టి విమర్శలే గుప్పించింది కాంగ్రెస్ పార్టీ.

అయితే కాంగ్రెస్ చేసిన విమర్శలన్నింటినీ కేటిఆర్ లైట్ తీసుకున్నారు. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం కేటిఆర్ కు బాగా కోపమొచ్చినట్లుంది. అందుకే ఆ అంశాన్ని మీడియా మిత్రుల వద్ద ప్రస్తావించారు. మల్లా ఆ మాట కాంగ్రెస్ నేతల నోటినుంచి వస్తే వాళ్ల సంగతి చెప్తా అని బెదిరించారు.

 ఆ మాట ఏదంటే.. కేటిఆర్ ఒక బచ్చా అని కాంగ్రెస్ నేతల రొటీన్ డైలాగ్. ఇప్పటికీ వందలసార్లు కేటిఆర్ ను కాంగ్రెస్ నేతలు ఆ పదంతో విమర్శించారు. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న కేటిఆర్ ఇప్పుడు ఆ మాట మీద గరం గరం అయ్యారు. కేటిఆర్ కు బచ్చా అనే మాట వినాలంటే అంత కోపం ఎందుకొచ్చిందబ్బా అని ఇటు టిఆర్ఎస్ లో అటు కాంగ్రెస్ లో జోరుగా చర్చించుకుంటున్నారు.

బచ్చా అంటే ఇకమీదట ఊరుకునే ప్రసక్తే లేదని కేటిఆర్ వార్నింగ్ ఇచ్చారు. మల్లా కాంగ్రెసోళ్లు బచ్చా అంటే ఏం చేస్తారని మీడియా వాళ్లు కేటిఆర్ ను అడిగితే.. వాళ్లు ఇంకోసారి బచ్చా అనమనండి అప్పుడు ఏం సమాధానం చెబుతానో చూడండి అని మంత్రి కేటిఆర్ కామెంట్ చేశారు.

కాంగ్రెసోళ్లూ మరి బచ్చా అనడం మానేస్తారా? లేక కేటిఆర్ ఏమంటడో చూద్దామని ఇంకోసారి ఆయనను బచ్చా అంటారా తేల్చుకోరి మరి..?

Follow Us:
Download App:
  • android
  • ios