ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు  వామపక్షాలు బలంగా ఉండేవి. వామపక్షాలకు ఈ జిల్లా కంచుకోట. కానీ నేడు ఖమ్మం జిల్లాలో వామపక్షాలు లేవు, దోమ పక్షాలు లేవు. ఉన్నదంతా గులాబీ పక్షమే. ఖమ్మం జల్లా  ప్రజలంతా సిఎం కెసిఆర్ కు మద్దతుగా నిలిచారు.

ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు వామపక్షాలు బలంగా ఉండేవి. వామపక్షాలకు ఈ జిల్లా కంచుకోట అని ప్రచారంలో ఉంది. కానీ నేడు ఖమ్మం జిల్లాలో వామపక్షాలు లేవు, దోమ పక్షాలు లేవు. ఉన్నదంతా గులాబీ పక్షమే. ఖమ్మం జల్లా ప్రజలంతా సిఎం కెసిఆర్ కు మద్దతుగా నిలిచారు.

వామపక్షాలపై తెలంగాణ మంత్రి కెటిఆర్ విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐటి హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జరిగిన సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ వామపక్షాలపై తీవ్రమైన విమర్శలు చేశారు. క్యాంపు ఆఫీసులో సిఎం కెసిఆర్ మనవడు, మనవరాలు ఏ సన్న బియ్యంతో భోజనం తింటున్నారో హాస్టల్ పిల్లలకు కూడా అదే సన్న బియ్యంతో భోజనం పెడుతున్న మనసున్న మహారాజు కెసిఆర్ అని కొనియాడారు.

4 లక్షల మంది బిడి కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. అదే వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, బెంగాల్, త్రిపుల లలో ఇంత సంఖ్యలో పెన్షన్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారా చెప్పాలన్నారు.

ఈ సభలో జిల్లా మంత్రి తుమ్మల, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.