Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ నోట రంగస్థలం సినిమా పాట

జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ ఓ తెలుగు సినిమా పాటను ఉదహరించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రంగస్థలం సినిమాలో గ్రామంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా హీరో  ఆ గట్టు నుంటావా నాగన్న ఈ గట్టకొస్తావా పాట పాడతాడని మంత్రి గుర్తు చేశారు. అలాగే పాలమూరు ప్రజలు కూడా ఓ గట్టుమీద కరెంట్ అడిగితే కాల్చిన కాంగ్రెస్, టిడిపిలు ఉన్నాయని...మరోగట్టుపై మీరు అడక్కపోయిన కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఉన్నారని అన్నారు. అలాగే 67 ఏళ్లు రైతులను రాబందుల్లా కాల్చుకుచంపినిన వారు ఉన్నారు....మరో గట్టుపై రైతులకు అండగా నిలిచి సంత్సరానికి 8 వేలిచ్చి రైతుబందుగా నిలిచిన  కేసీఆర్ ఉన్నారన్నారు.  200 పించన్లు ఇచ్చిన వారు ఓ గట్టుపై ఉంటే రూ.1000, రూ. 1500 ఇచ్చిన కేసీఆర్ మరో గట్టుపై ఉన్నారు. వీటిని గమనించి ప్రజలు ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలని కేటీఆర్ సూచించారు.
 
ktr jogulamba gadwal district election campaign
Author
Makthal, First Published Oct 29, 2018, 3:24 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ ఓ తెలుగు సినిమా పాటను ఉదహరించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రంగస్థలం సినిమాలో గ్రామంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా హీరో  ఆ గట్టు నుంటావా నాగన్న ఈ గట్టకొస్తావా పాట పాడతాడని మంత్రి గుర్తు చేశారు. అలాగే పాలమూరు ప్రజలు కూడా ఓ గట్టుమీద కరెంట్ అడిగితే కాల్చిన కాంగ్రెస్, టిడిపిలు ఉన్నాయని...మరోగట్టుపై మీరు అడక్కపోయిన కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఉన్నారని అన్నారు. అలాగే 67 ఏళ్లు రైతులను రాబందుల్లా కాల్చుకుచంపినిన వారు ఉన్నారు....మరో గట్టుపై రైతులకు అండగా నిలిచి సంత్సరానికి 8 వేలిచ్చి రైతుబందుగా నిలిచిన  కేసీఆర్ ఉన్నారన్నారు.  200 పించన్లు ఇచ్చిన వారు ఓ గట్టుపై ఉంటే రూ.1000, రూ. 1500 ఇచ్చిన కేసీఆర్ మరో గట్టుపై ఉన్నారు. వీటిని గమనించి ప్రజలు ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలని కేటీఆర్ సూచించారు.

గద్వాల జిల్లా మక్తల్ మీనీ స్టేడియంలో ప్రజాదీవెన సభలో మంత్రి కేటీఆర్ తో పాటు, చర్నకోల లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో ఓ సభలో మాట్లాడుతూ తన తమ్ముడి వల్ల తండ్రి నర్సారెడ్డి ఆత్మ క్షోభిస్తోందన్న కాంగ్రెస్ నాయకురాలు డికె. అరుణ మాటలను ఆయన ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ రైతులకు అందిస్తున్న తోడ్పాటును చూసి నర్సారెడ్డి  ఆత్మ ఆనందపడుతూ ఉంటుందని....ఎందుకంటే ఆయన కూడా ఓ రైతు కుటుంబానికి చెందినవారే కదా అని కేటీఆర్ గుర్తుచేశారు.. 

మక్తల్ ల్లో మహాకూటమి తరపున టిడిపి అభ్యర్థి దయాకర్ కు సీటిచ్చినట్లు ఇప్పుడే తెలిసిందని కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికలు రామ్మోహన్ రెడ్డి, దయాకర్ రెడ్డికి మధ్య జరుగుతున్నవి కాదని... పాలమూరుకు నీళ్లు రావాలా, కన్నీళ్లతోనే ఉండాలా అని నిర్ణయించుకునే ఎన్నికలని పేర్కొన్నారు.  ప్రజలకు నీళ్ళిస్తే తమ కిందికి నీళ్లోస్తాయని కాంగ్రెస్ నాయకులు బయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందువల్లే ఈ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కేసులు వేశారని కేటీఆర్ మండిపడ్డారు.  చంద్రబాబు కూడా పాలమూరు పథకానికి వ్యతిరేకంగా కేంద్రానికి 30 ఉత్తరాలు రాశారన్నారు. తెలంగాణ కు అడ్డంపడ్డ గడ్డాల ఉత్తమ్, చంద్రబాబు మళ్లీ అభివృద్దికి అడ్డంపడాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 

ప్రధాని మోదీ, ఏపి సీఎం చంద్రబాబులకు తాము భయపడబోమని అన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం ఆ దేవుడితో కూడా కోట్లాడటానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు.  రానున్న ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని  మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అలా అడిగితే ఇలా చెప్పా: చంద్రబాబుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మీద కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతికి ప్రధాని మట్టినీళ్లు, కేసిఆర్ వెనక్కి...: కేటీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios