రుతుపవన వర్షాల సమయంలో హైదరాబాద్ నగరంలో ఎదురయ్యే ఎమర్జీన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా జిహెచ్ ఎంసి, విద్యుత్ రంగ ఉద్యోగులంతా విధుల్లో ఉండాలని మునిసిపల్ ఐటి మంత్రి కె టి రాామారావు అదేశించారు.దీనికోసం ఆయన జిహెచ్ ఎంసి, టిఎస్ ట్రాన్స్ కో, మెట్రోవాటర్ బోర్డు లో సిబ్బంది సెలవులను రద్దు చేశారు. నిరుటి  హైదరాబాద్ లో వర్ష బీభత్సం అనుభవంతో ఆయన ఈ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు.

రుతుపవన వర్షాల సమయంలో హైదరాబాద్ నగరంలో ఎదురయ్యే ఎమర్జీన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా జిహెచ్ ఎంసి, విద్యుత్ రంగ ఉద్యోగులంతా విధుల్లో ఉండాలని మునిసిపల్ ఐటి మంత్రి కె టి రాామారావు అదేశించారు.

దీనికోసం ఆయన జిహెచ్ ఎంసి, టిఎస్ ట్రాన్స్ కో, మెట్రోవాటర్ బోర్డు లో సిబ్బంది సెలవులను రద్దు చేశారు.

రుతుపవన వర్షాకాలం ముగిసే దాకా ఎవరూ సెలవు పెట్టడానికి వీల్లేదుని, దీనికి సహకరించాని ఆయన అధికారులను సిబ్బందిని కోరారు.

వర్షాకాల ఎమర్జన్సీని దృష్టిలో పెట్టుకుని , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీచేశారు.

ముందు ముందు పెద్ద వర్షాలు కురిసే సూచనలు న్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో వర్షవిపత్తులను ఎదుర్కొనేందుకు, భద్రత, పునరావాస చర్యలు చేపట్టేందుకు సొంతంగా రంగంలోకి దిగాలని ఆయన అధికారులకు సూచనలిచ్చారు.

అధికారులంతా అన్ని వేళలా అవసరమయినచోటల్లా అందుబాటులో ఉండాలని కూడా ఆయన ఆదేశించారు. 2016 లో అదికారుల అప్రమత్తంగా లేకపోవడంతో ఇలా జరిగింది. 

ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందు కెటిఆర్ చర్యలు మొదలుపెట్టారు.