Asianet News TeluguAsianet News Telugu

పరకాలకు వెయ్యి కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే ఇస్తం : కేటిఆర్

  • పరకాల సభలో కేటిఆర్, కడియం
  • వెయ్యి కోట్లే కాదు పరకాలకు అంతకంటే ఎక్కువే ఇస్తాం
ktr announces more funds to parakal constituency

పరకాల నియోజక వర్గం పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లు. పాల్గొన్న ఎంపీ దయాకర్ , జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, రాజయ్య, చైర్మన్లు పెద్ది సుదర్శన్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు, టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తక్కెలపల్లి రవీందర్ రావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, స్థానిక జడ్పిటిసి లు, ఎంపిటిసిలు, స్థానిక నేతలు.

ktr announces more funds to parakal constituency

పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ...కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఎలా ఉండేది, ముఖ్యమంత్రి గా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన ఈ 4 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలే ఆలోచించాలి. ఇప్పుడు 24గంటలు కరెంట్ వస్తుంది. మిషన్ భగీరథ ద్వారా నెల రోజుల్లో పూర్తిగా ఇంటింటికి తాగునీరు రానుంది. కళ్యాణ లక్ష్మీ ద్వారా ఆడబిడ్డ పెళ్లికి 75,116 రూపాయలు అందిస్తున్న మేనమామ సీఎం కేసీఆర్. గర్భం దాల్చిన ఆడబిడ్డ పని చేయకుండా ఉండేందుకు 6 నెలల పాటు 2వేల రూపాయల చొప్పున 12వేల రూపాయలు ఇస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. ఉచితంగా 24 గంటల కరెంట్ తెలంగాణలో ఇస్తున్నపుడు ... దేశంలో ఎందుకు చెయ్యరని అడుగుతున్న. తెలంగాణలో రైతు రుణాలు మాఫీ చేశారు, మరి కేంద్రంలో ఎందుకు ఇవ్వరు?. అందుకే సీఎం కేసీఆర్ బీజేపీ కి, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ రావాలంటున్నారు. అందుకే సీఎం కేసీఆర్ వెంట ఉండి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను.

 సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఇస్తున్న పెన్షన్ల వల్లే మా కోడళ్లు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు..మా పెద్ద కొడుకు కేసీఆర్ వల్లే మంచిగా ఉంటున్నమని ఒక పెద్దామే ఇందాకే చెప్పింది. పరకాల నియోజకవర్గం కోసం వెయ్యి కోట్లు కాదు ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు అయినా ఇస్తాం. 4 ఏళ్ళ కిందట కరెంట్ ఎలా వచ్చేది, రైతుల పరిస్థితి ఎలా ఉండేది గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది కరెంట్ పరిస్థితి. నాడు రైతన్నలు విత్తనాలు, ఎరువుల కోసం ఎలా క్యూ లైన్లలో ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అని అడుగుతున్నా. మొట్ట మొదటి సారి రైతుల దగ్గర నుంచి పైసలు తీసుకోవడం కాదు మీ పంటకు ఎకరానికి 4 వేలు ఇస్తానన్న సీఎం కేసీఆర్ కాదా? అన్నారు.
రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా ప్రకటించిన నాయకుడు కేసీఆర్. పరకాలలో ఎన్నడూ లేని విధంగా 15 కోట్లు ఒక్కసారి ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. మీకు ఉపాధి కల్పించేందుకు టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశాం. మీ అభివృద్ధి కోసం పని చేసే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.

సమావేశంలో ప్రతిపక్షాలపై  ఎమ్మెల్యే ధర్మారెడ్డి మండిపడ్డారు. నాడు 200 కోట్ల రూపాయలు నియోజక వర్గ అభివృద్ధికి ఇవ్వమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అడిగితే ఇవ్వమని చెబితే..నియోజక వర్గ అభివృద్ధి కోసం టీ ఆర్ ఎస్ లో చేరాను..నియోజక వర్గానికి 1000 కోట్ల రూపాయలు తెచ్చాను. పదేళ్లు పాలించి అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభివృద్ధి చేయడం లేదని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios