Asianet News TeluguAsianet News Telugu

కేటిఆర్, లోకేశ్ సేమ్ పించ్

  • ఇద్దరు యువ నేతలు ఒకే రీతిలో
  • యాదృచ్ఛికమేనా?
  • సడెన్ గా ఇలా ఎందుకబ్బా అని పార్టీల్లో చర్చలు
ktr and lokesh are busy in foreign  tours

వాళ్లిద్దరూ చెరో రాష్ట్రానికి యువరాజు లాంటోళ్లు. వాళ్లిద్దరి తండ్రులూ చెరో తెలుగు రాష్ట్రానికి సిఎం లు. వాళ్లిద్దరూ స్వయంగా ఆయా రాష్ట్రాల్లో మంత్రులే. వాళ్ల శాఖలు కూడా కొద్ది గొప్ప తేడాతో సేమ్ పించ్. అయితే తాజాగా వారిద్దరూ అనుకోకుండానే ఒకేరకమైన పనులు చేశారు. ఇంతకూ వాళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదివేయండి మరి.

 

పండగ ముందు అమాత్యుల విదేశీ ప‌ర్య‌ట‌న‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. రెండు స్టేట్లలోని ముఖ్య‌మంత్రుల త‌న‌యులు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అది కూడా ఇక్కడ కీలకమైన పండుగలను వదిలేసి విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు మరి.

తెలంగాణ రాష్ట్ర విష‌యానికొస్తే.... రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బతుక‌మ్మ పండుగ‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు త‌నయుడు,  రాష్ట్ర మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ( కేటీఆర్‌) ద‌గ్గ‌రుండి మరీ ప‌నులు చ‌క్క‌బెట్టాడు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో బ‌తుక‌మ్మ పండ‌గ‌కు అవ‌మానం జ‌రుగుతుంద‌ని తెలంగాణ వ్యాప్తంగా బతుక‌మ్మ‌ను బ‌తికించుకుందామ‌ని నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌తో ఉద్య‌మాన్ని న‌డిపించారు. వారు అనుకున్న‌ట్టే... స్వ‌రాష్ట్రం సిద్ధించిన త‌ర్వాత బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.

అయితే ఈ ఏడు ఒక అడుగు ముందుకేసీన ప్ర‌భుత్వం ప‌ద్దెనిమిదేళ్లు నిండిన ఆడ‌ప‌డుచుల‌కు బతుకమ్మ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. అయితే అది వారు అనుక‌న్న స్థాయిలో విజ‌యవంతం కాక‌పోగా... న‌డి బ‌జారులో అబాసుపాలైందన్న విమర్శలున్నాయి. క్షేత్ర‌స్థాయి నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో... ముఖ్య‌మంత్రి నుంచి మంత్రుల వ‌ర‌కు ఎవ‌రూ కూడా వారి స్థాయిలో స్పందించ‌లేదు. అయితే ఈ చీరల పంపిణీ కార్య‌క్రమాన్ని ద‌గ్గ‌ర ఉండి ప‌ర్య‌వేక్షించిన మంత్రి కేటీఆర్ మాత్రం తెలంగాణలో జ‌రిగే బ‌తుక‌మ్మ ఉత్స‌వాలకు ఇక్క‌డ ఉండ‌కుండా... కుటుంబ స‌భ్యుల‌తో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం అంద‌ర్ని విస్మ‌యాన్ని గురి చేస్తోంది. ఇంత పెద్ద సండుగ వేళ కేటిఆర్ విదేశాలకు ఎగిరిపోవడం రకరకాల చర్చలకు దారి తీసింది. ఆయన సౌతాఫ్రికాకు కుటుంబంతో సహా వెళ్లినట్లు చెబుతున్నారు. అక్టోబరు 3వ తేదీన తిరిగి హైదరాబాద్ కు రానున్నట్లు చెబుతున్నారు.

అస‌లు తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ పండుగ తెరాస అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే అధికారికంగా చేసుకుంటున్నారు. బతుకమ్మ పండుగకు ఎంతో హ‌డ‌వుడి చేసిన ఆ కుటుంబం ఇప్ప‌డు పండుగ‌కు దూరంగా ఉండ‌డం ఏంటీ అని జనాలు షాక్ అవుతున్నారు. దీనికి అస‌లు కార‌ణం చీర‌ల పంపిణీ బెడిసికొట్టింద‌ని, ఆ బాధ నుంచి ఉపశమనం కోసమే విదేశాలకు వెళ్లారని కొందరు నేతలు గుస‌గుస‌లాడుతున్నారు.

ఇక మ‌రో ప‌క్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న‌యుడు లోకేశ్ కూడా విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. కేటిఆర్ లాగే ఆయన కూడా కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లారు. అయితే లోకేశ్ మాత్రం సౌత్ ఆఫ్రీకా వెళ్లలేదు. సింగపపూర్ వెళ్ళారు. మరి ఎపిలో ద‌స‌ర క‌న‌క‌దుర్గ ఉత్స‌వాలు వ‌చ్చాయంటే.. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ దేవి సంబరాల గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే.. ఆ దేవికి అంతటి ప్ర‌తిష్ట‌త ఉంది. అయితే... బెజ‌వాడు నుంచి పాల‌న సాగిస్తున్న టీడీపీ ప్ర‌భుత్వం ఈ ఉత్స‌వాలును ఘ‌నంగా చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికితోడు అమరావతి పాలన మొదలైన తర్వాత తొలి దసరా ఇదే కావడంతో అంగరంగ వైభంగా జరుపుతున్నారు. మరి ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలకు లోకేష్ దూరంగా ఉండడమేంటబ్బా అన్న చర్చ జరుగుతోంది.  అయితే సింగపూర్ లో తాజాగా ప్రభుత్వ మార్పిడి జరిగింది. ఈ నేపథ్యంలో లోకేశ్ సింగపూర్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు చెబుతున్నారు. పార్టీలో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios