విద్యాసాగర్‌రావుకు కరోనా: ఐసోలేషన్‌లో కోరుట్ల ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కరోనా సోకింది. హైద్రాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే ఐసోలేషన్ లో ఉన్నారు. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

Korutla MLA Vidyasagar Rao tested Corona positive

జగిత్యాల : జగిత్యాల జిల్లా korutla mla  కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు Corona పాజిటివ్‌గా తేలింది. రెండు రోజులుగా ఆయన అనారోగ్యంగా ఉండటంతో బుధవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా సోకిందని తేలింది.  వైద్యుల సూచనల మేరకు hyderabadలోని తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. Trs plenary సందర్భంగా కలిసిన టీఆర్‌ఎస్‌ నాయకులు కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యాసాగర్‌రావుకు కరోనా సోకడంతో టీఆర్‌ఎస్ నేతలతో పాటు ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నెల 25వ తేదీన టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ నేతలు  హైద్రాబాద్ కు వచ్చారు. ప్లీనరీకి ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ ప్లీనరీలో kalvakuntla Vidyasagar rao  ఎవరెవరిని కలిశారో వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కూడా ఇటీవల కాలంలో కరోనా కేసులు తక్కువగానే నమోదౌతున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజలు వివిధ పండుగల్లో పాల్గొంటున్నారు. పండుగలను పురస్కరించుకొని కరోనా ప్రోటోకాల్స్ పాటించాలని కేంద్రం కోరుతుంది. మాస్క్ ధరించడంతో పాటు తరచుగా చేతులు శుభ్రపర్చుకోవాలని  వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న కోవిడ్‌  కేసుల్లో కొత్త వేరియంట్‌ ఏవై.4.2(AY.4.2) తీవ్ర భయాందోళనలు కలగజేస్తుంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో ఈ కొత్త వేరియంట్‌ తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కుటుంబానికి చెందింది. దీని వల్ల కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్‌ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్‌ గురించి పరిశోధిస్తున్నారు.

also read:కర్ణాటకలో కరోనా కలకలం: గురుకుల పాఠశాలలో 32 మందికి కోవిడ్, ఆసుపత్రికి తరలింపు

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో  ఏవై 4.2 వేరియంట్  కలకలం సృష్టించింది. ఒకే రోజు కొత్త రకం వేరియంట్  కేసులు మూడు నమోదయ్యాయి.కొత్త రకం వేరియంట్ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. గత 28 రోజుల్లో నమోదైన కొత్త కేసుల్లో 63 శాతం కొత్త సబ్ వేరియంట్ కేసులేనని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చినవారికి 72 గంటల తప్పనిసరిగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాల్సిందే. విదేశాల నుండి వచ్చిన వారికి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్వారంటైన్ అమలు చేయడం లేదు. 

ఇదిలా ఉంటే కర్ణాటకలోని  Kodagu  జిల్లా Madikeri జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్ధులకు కరోనా సోకింది.  ఈ రెసిడెన్షియల్  స్కూల్‌లో  270 మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే 22 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలకు కరోనా సోకిందని  స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios