Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో కరోనా కలకలం: గురుకుల పాఠశాలలో 32 మందికి కోవిడ్, ఆసుపత్రికి తరలింపు

కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలోని  ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో 32 మంది విద్యార్ధులకు కోవిడ్ సోకింది. విద్యార్ధులను చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు.

32 Students At Karnataka Boarding School Test Covid-Positive
Author
Bangalore, First Published Oct 28, 2021, 3:21 PM IST

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలోని 32 మంది విద్యార్ధులకు Coronaసోకింది. అయితే విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పాఠశాల వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం కేసుల తీవ్రత ఎక్కువగానే ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని  Kodagu  జిల్లా Madikeri జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్ధులకు కరోనా సోకింది.  ఈ రెసిడెన్షియల్  స్కూల్‌లో  270 మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే 22 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలకు కరోనా సోకిందని  స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు.9వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్ధులు కరోనా బారినపడినట్టుగా స్కూల్ వర్గాలు తెలిపాయి. వారం రోజుల క్రితం విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే 32 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో స్కూల్ ప్రిన్సిపల్ అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన విద్యార్ధులను ఐసోలేషన్ కు తరలించారు.

కరోనా సోకిన  32 మంది విద్యార్ధుల్లో  కొందరికి కనసీం లక్షణాలు కూడ కన్పించలేదు. కేవలం 10 మంది విద్యార్ధుల్లో మాత్రమే కోవిడ్ లక్షణాలు కన్పించాయి. అయితే 22 మందికి మాత్రం ఎలాంటి లక్షణాలు కన్పించలేదని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు.. మరోవైపు స్కూల్ లో పనిచేసే సిబ్బందిలో ఒకరు కరోనా బారినపడ్డారు.  కరోనా బారిన పడిన వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read:భారత్‌లో కొత్తగా 16,156 కరోనా కేసులు .. 3.42 కోట్లకు చేరిన మొత్తం సంఖ్య

కరోనా సోకిన 32 మంది విద్యార్ధులు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ప్రిన్సిపల్ Pankajashan తెలిపారు. 32 మంది విద్యార్ధులకు కరోనా సోకడంతో క్యాంపస్ మొత్తాన్ని శానిటైజేషన్ చేసినట్టుగా ప్రిన్సిపల్ ప్రకటించారు. మరో వైపు ఈ స్కూల్ లోని  ఇతర విద్యార్ధులకు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నామని ప్రిన్పిపల్ తెలిపారు.జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఇతర అధికారులు ఈ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. విద్యార్ధులకు ధైర్యం చెప్పారు. మరోవైపు ఈ స్కూల్ లో చదువుకొనే విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా కలెక్టర్ హామీ ఇచ్చారు. 

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో  ఏవై 4.2 వేరియంట్  కలకలం సృష్టించింది. ఒకే రోజు కొత్త రకం వేరియంట్  కేసులు మూడు నమోదయ్యాయి.
విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చినవారికి 72 గంటల తప్పనిసరిగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాల్సిందే. విదేశాల నుండి వచ్చిన వారికి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్వారంటైన్ అమలు చేయడం లేదు. కొత్త రకం వేరియంట్ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. గత 28 రోజుల్లో నమోదైన కొత్త కేసుల్లో 63 శాతం కొత్త సబ్ వేరియంట్ కేసులేనని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.యూకే, చైనాలోనూ కొత్త రకం వేరియంట్ కేసులు పెద్ద ఎత్తున నమోదౌతున్నాయి. రష్యాలో కూడ  ఇటీవల కాలంలో కరోనా కేసుల వ్యాప్తి పెరిగింది. దీంతో రష్యా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios