చెవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిలను విడి విడిగా కలిసి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ ఎన్నికలపై ఆయన వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది.

టీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మేడ్చల్‌లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీల సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.

ఆయనతో పాటు టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ జగదీశ్ రెడ్డి, జనగామ మాజీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్‌ టీడీపీ నేత నరోత్తంరెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు.

సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీ యాదవరెడ్డి

కేటీఆర్ బంపరాఫర్: అయినా పార్టీని వీడిన విశ్వేశ్వర్ రెడ్డి

రెండేళ్లుగా నా బాధను ఎవరూ పట్టించుకోలేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు: మహేందర్ రెడ్డి

ఇమడలేకపోతున్నా: విశ్వేశ్వర్ రెడ్డి, 23న కాంగ్రెస్‌లోకి...

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం