మూడు సీట్లు ఆఫర్ చేసిన కేసిఆర్: రాజీకి కొండా సురేఖ నో

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 17, Sep 2018, 10:23 PM IST
Konda Surekha may not meet KCR
Highlights

కొండా దంపతులు పార్టీ వీడితే జరిగే నష్టాన్ని గుర్తించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు స్వయంగా రంగంలోకి దిగారు.

వరంగల్‌: కొండా దంపతులు పార్టీ వీడితే జరిగే నష్టాన్ని గుర్తించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు స్వయంగా రంగంలోకి దిగారు. కొండా దంపతులకు మూడు సీట్లు ఇవ్వడానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, తనను కలవాలని ఆయన కొండా దంపతులను ఆహ్వానించినట్లు చెబుతున్నారు. 

వినాయక చవితి నవరాత్రుల తర్వాత తాము కలుస్తామని వారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వినాయక చవితి నవరాత్రులు తమకు అచ్చిరావనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రారు. ఏ కార్యక్రమంలోనూ పాల్గొనరు. దాంతో నవరాత్రుల తర్వాత వస్తామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కేసిఆర్ తో వారు రాజీకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. 

ఆ వార్తల్లో నిజం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాము కేసీఆర్ ను కలిసి మూడు టికెట్లు తీసుకుని టీఆర్ఎస్ లో ఉంటే రాజకీయంగా దెబ్బ తింటామనే ఉద్దేశంతో కొండా దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మెయిల్ చేసి టికెట్లు తీసుకున్నారనే నిందలు మోయాల్సి వస్తుందని, దానివల్ల రాజకీయంగా దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని కొండా దంపతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీ తర్వాత వారు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

కాంగ్రెసులో చేరడానికి కూడా వారు ఏ విధమైన ప్రయత్నాలు చేయడం తెలుస్తోంది. ఇండిపెండెంట్ అభ్యర్థులుగానే మూడు సీట్లకు పోటీ చేయాలని వారు ఇప్పుడు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఈస్ట్, పరకాల, భూపాల పల్లి సీట్లకు వారు పోటీ చేస్తారని అంటున్నారు. వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, భూపాలపల్లి నుంచి కొండా మురళి, పరకాల నుంచి వారి కూతురు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

కొండా దంపతులు తెలంగాణలో 10 శాసనసభ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరని కేసిఆర్ కు ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. భూపాలపల్లి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, సూర్యాపేట, నర్సంపేట, హుస్నాబాద్, హుజురాబాద్, జగిత్యాల, ఎల్ బి నగర్ స్థానాల్లో వారి ప్రభావం ఉంటుందని అంటున్నారు. 

ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థులుగానే ఎన్నికల బరిలోకి దిగుదామని అనుకుంటన్న కొండా సురేఖ దంపతులు చివరి క్షణంలో కాంగ్రెసులో చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కాంగ్రెసుకు కూడా వారి అవసరం దండిగా ఉంది. దీంతో కాంగ్రెసు వారి కోసం ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు.  

ఈ వార్తాకథనాలు చదవండి

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

loader