Asianet News TeluguAsianet News Telugu

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

తమను పార్టీలోకి తీసుకోవడం అప్పట్లో మంత్రి హరీష్ రావుకు ఇష్టం లేదని, తమను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు అలిగి హరీష్ రావు భోజనం చేయకుండా పడుకున్నారని ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ అన్నారు. 

Konda Surekha blames KTR for the present situation
Author
Hyderabad, First Published Sep 8, 2018, 12:36 PM IST

హైదరాబాద్‌: తమను పార్టీలోకి తీసుకోవడం అప్పట్లో మంత్రి హరీష్ రావుకు ఇష్టం లేదని, తమను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు అలిగి హరీష్ రావు భోజనం చేయకుండా పడుకున్నారని ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ అన్నారు. 

మహిళలు లేకుండా తెలంగాణ వచ్చిందా, మంత్రి పదవి ఇవ్వకుండా మహిళలను అవమానించడం సరైందేనా అని కొండా సురేఖ అడిగారు. పార్టీలో చేరినప్పుడు తమ వెంట ఉన్న నాయకుడు ఆ తర్వాత తమకు కనిపించలేదని, మళ్లీ టికెట్ కోసం ఇప్పుడు ఫోన్ చేశారని ఆమె అన్నారు. 

తమకు వ్యతిరేకంగా పనిచేసే గుండు సుధారాణిని గానీ ఎర్రబెల్లి దయాకర్ రావును గానీ పార్టీలోకి తీసుకున్నప్పుడు తమకు చెప్పలేదని అన్నారు. పార్టీలోకి మొదట వచ్చి, పార్టీ జెండా కింద తాము గెలిచామని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లిని నెత్తిన పెట్టుకున్నారని ఆమె అన్నారు.  

టీడీపి నుంచి వచ్చిన ముగ్గురికి టికెట్లు ఇచ్చారని, తన టికెట్ మాత్రమే పెండింగులో పెట్టారని, ఇంత కష్టపడి గెలిచిన తనకు టికెట్ ఎందుకు ఆపారో చెప్పాలని ఆమె అన్నారు. తెలంగాణ అనేది కల్వకుంట్ల ఇల్లు కాదని ఆమె అన్నారు. 

హరీష్ రావుకు తాము పార్టీలోకి రావడం ఇష్టం లేదని, అయినా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన తమ వెంట ఉన్నారని, పార్టీలోకి తెచ్చిన కేటీఆర్ తమను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. అందరినీ కేటీఆర్ తనపైకి ఉసిగొలుపుతున్నారని ఆమె అన్నారు. రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. బహిరంగ లేఖ రాసి తన నిర్ణయం ప్రకటిస్తానని ఆమె అన్నారు. 

భూపాలపల్లి టికెట్ మధుసూదానాచారికి ఇవ్వకపోతే తమకు ఇవ్వాలని అడిగామని ఆమె చెప్పారు. అయితే, వరంగల్ ఈస్ట్ నుంచి తానే పోటీ చేస్తానని, ఒక్క సీటు చాలునని చెప్పానని, రెండు సీట్లు అడిగారు కాబట్టి సురేఖ అలిగారని బద్నాం చేస్తున్నారని ఆమె అన్నారు. తన పేరు తొలి జాబితాలో ప్రకటించాలని కేటీఆర్ కు చెప్పానని, అదే విషయం సంతోష్ కు కూడా చెప్పానని ఆమె చెప్పారు. 

పార్టీలో చేరిన తర్వాత కేటీఆర్ తెల్లారి నుంచి ఫోన్ ఎత్తరని ఆమె అన్నారు. టీఆర్ఎస్ లో చేరిన సురేష్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుందని అన్నారు. కేటీఆర్ కోటరీ తయారు చేస్తున్నారని, తెలంగాణను ఆగం పట్టిస్తున్నారని ఆమె అన్నారు. సుమన్, నరేంద్ర రెడ్డి లాంటి వారికి టికెట్లు ఇవ్వడం అందులో భాగమేనని అన్నారు.

తన లాంటి వాళ్లు ఉంటే ప్రశ్నిస్తామని టికెట్ ఇవ్వకుండా ఆపారని ఆమె అన్నారు. తాము చెప్పే పార్టీ నుంచి వెళ్తామని, దొంగదారులు తమకు తెలియదని, ముక్కుసూటిగానే ఉంటామని ఆమె అన్నారు. 

తమ ఫోన్లు, తమ డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కొండా మురళి అన్నారు. అవసరమైతే మూడు నియోజకవర్గాల్లో తాము పోటీ చేస్తామని సురేఖ అన్నారు. తొలి విడత జాబితాలోని అభ్యర్థుల్లో ఎంత మందికి బీ ఫారాలు ఇస్తారో తెలియదని ఆమె అన్నారు. 
 

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

షాకింగ్ న్యూస్.. వైసీపీ నేత పెద్దారెడ్డి కి గుండెపోటు

కేసీఆర్ కు జానారెడ్డి సవాల్... నిరూపిస్తే అన్నమాట ప్రకారం నడుచుకుంటా : జానారెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios