Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణ స్మారకానికి మూడెకరాలు.. జయశంకర్‌కు గజం కూడా ఇవ్వలేదు: కొండా సురేఖ

తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఘోరంగా అవమానించారని ఆరోపించారు మాజీ మంత్రి కొండా సురేఖ. నందమూరి హరికృష్ణ చనిపోతే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారని.. అంతేకాకుండా స్మారక స్థలానికి మూడెకరాలు సైతం కేటాయించాలని కేసీఆర్ ఆదేశించారని సురేఖ గుర్తు చేశారు

konda surekha fires on kcr
Author
Hyderabad, First Published Sep 25, 2018, 12:20 PM IST

తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఘోరంగా అవమానించారని ఆరోపించారు మాజీ మంత్రి కొండా సురేఖ. నందమూరి హరికృష్ణ చనిపోతే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారని.. అంతేకాకుండా స్మారక స్థలానికి మూడెకరాలు సైతం కేటాయించాలని కేసీఆర్ ఆదేశించారని సురేఖ గుర్తు చేశారు.

కానీ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ స్మారక స్థలానికి మాత్రం గజం స్థలం కేటాయించలేదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి జమిలి ఎన్నికలకు సిద్ధమని చెప్పి.. హైదరాబాద్ రాగానే అసెంబ్లీకి వేరుగా.. పార్లమెంటుకు వేరుగా ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ అన్నారు 

దీని వల్ల వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం కాదా అని సురేఖ ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కేసీఆర్ చెప్పే కారణాలు సబబుగా లేవన్నారు. ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రాకపోతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు.

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

రేపే ముహూర్తం: కొండా సురేఖ గమ్యం ఎటు వైపు?

మూడు సీట్లు ఆఫర్ చేసిన కేసిఆర్: రాజీకి కొండా సురేఖ నో

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

Follow Us:
Download App:
  • android
  • ios