హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై సొంతపార్టీలోనే తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది. మొన్న మాజీ ఎంపీ వీహెచ్, నిన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నేడు ఎంపీ మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇలా రోజుకొక కాంగ్రెస్ నాయకుడు కేవలం రేవంత్ పై విమర్శలు చేయడానికే అన్నట్లుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. 

శనివారం రేవంత్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఎమ్మెల్యేగా  ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడు మాత్రమేనని... పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడు మాత్రం కాదన్నారు. ఆయనకు డీసెంట్ రాజకీయాలు చేయడం రాదని ఆరోపించారు.

read more  చిటికెస్తే 10 వేల మంది దిగుతారు.. చూస్తావా: రేవంత్‌పై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

తనపై ప్రభుత్వం కేసులు పెట్టగానే రేవంత్ కు  111 జీవో గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. అప్పటివరకు దీనిపై కనీసం ఒక్కసారయినా నోరెత్తని వ్యక్తి 111జీవో పరిధిలో కేటీఆర్ అక్రమనిర్మాణాలు చేపట్టాడంటూ తన అక్రమాలు బయపడగానే ఆరోపించడం ఏంటని ప్రశ్నించారు. ఇది బ్లాక్ మెయిల్ రాజకీయాలు కావా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. 

మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం చిల్లర పనిగా కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పిల్లచేష్టల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా వుంటాయన్నారు. గతంలో ఛలో ప్రగతిభవన్ సమయంలోనూ రేవంత్ టీషర్టు వేసుకుని చాలా చిల్లరగా వ్యవహరించాడని... కారెక్కి షో చేస్తూ  తనను  తాను హీరోగా ఫీలవుతుంటాడని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇకనైనా రేవంత్ తన ప్రవర్తనను మార్చుకుంటే మంచిదని సాటి నాయకుడిగా చెబుతున్నానని కోమటిరెడ్డి అన్నారు. 

read more  రేవంత్ కు అధిష్టానం మద్దతు... హైదరాబాద్ కు సుప్రీంకోర్ట్ సీనియర్ లాయర్