హైదరాబాద్: వివిధ కేసుల్లో చిక్కుకుని ప్రస్తుతం జైల్లో వున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి న్యాయసహాయం అందించడానికి  ఏఐసిపి ముందుకువచ్చింది. ఆయనకు సంబంధించిన కేసులన్నింటిని  వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రేవంత్ సల్మాన్ ఖుర్షీద్ ను నియమిచింది. ఏఐసిసి ఆదేశాల మేరకు ఖుర్షీద్ ఆధ్వర్యంలో లాయర్ల బృందం హైదరాబాద్ వచ్చింది. 

మంత్రి కేటీఆర్‌ లీజుకు తీసుకొన్న ఫామ్ హైస్ పై ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని రేవంత్ రెడ్డిపై నార్సింగి పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే బెయిల్ కోసం రేవంత్ పెట్టుకున్న పిటిషన్ ను కూకట్‌పల్లి కోర్టు   కొట్టివేసింది.

read more  చిటికెస్తే 10 వేల మంది దిగుతారు.. చూస్తావా: రేవంత్‌పై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఈ కేసులో రేవంత్ రెడ్డి అనుచరులకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యింది. కానీ ప్రధాన నిందితుడిగా వున్న రేవంత్ రెడ్డికి మాత్రం బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను ఉపయోగించిన కేసులో రేవంత్  ఏ-1 నిందితుడుగా ఉన్నాడు. 

అలాగే గోపన్‌పల్లి భూముల  విషయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. గోపన్‌పల్లి భూముల విషయంలో  రేవంత్ రెడ్డి సోదరులు అక్రమాలకు పాల్పడ్డారని  రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సర్వే నెంబర్ 127లో  భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని రెవిన్యూ అధికారులు తేల్చారు.

read more  రేవంత్‌కు షాక్: బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కూకట్‌పల్లి కోర్టు

ఈ రెండు కేసుల విషయంలోనూ ఇప్పటికే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసుల నుండి రేవంత్ తరపున వాదించేందుకు ప్రముఖ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ను ఏఐసిసి హైదరాబాద్ కు పంపించింది. ఈయన తెలంగాణ హైకోర్టులో  రేవంత్ కు మద్దతుగా వాదించనున్నారు.